Viral: హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
అపాయం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. అదృష్టం బాగా లేకుంటే తాడే పామై కరుస్తదని సామెత. పామంటే గుర్తుకొచ్చింది. ఇక్కడ ఓ చోట అక్కడా ఇక్కడా కాదు.. ఏకంగా హెల్మెంట్‌లో దూరి మరీ ఓ వాహనదారుడిని కాటేసింది. ఇదే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. గతంలో షూలు, దుస్తుల్లో పాములు దూరండం చూశాం గానీ ఇలా హెల్మెట్‌లో దూరడంపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం, ఓ వ్యక్తి స్కూటీమీద వెళుతూ అకస్మాత్తుగా పక్కకు ఒరిగిపోయాడు. అతడి హెల్మెట్లోని పాము ఏకంగా నెత్తిపై కాటేయడమే ఇందుకు కారణం. హెల్మెట్‌లో పిల్ల నాగు పాము ఉన్న విషయాన్నే అతడు గుర్తించలేదు. ఎప్పటిలాగే హెల్మెట్‌ను దులపకుండా నెత్తికి పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక పాము అతడినెత్తిపై సడెన్‌గా కాటువేసింది. దీంతో స్కూటీని రోడ్డుకు ఓ పక్కగా ఆపాక అతడు ముందుకు ఒరిగిపోయాడు.
ఇది గమనించిన చుట్టుపక్కల వారు వాహనదారుడి హెల్మెట్ తొలగించి అతడిని తిన్నగా కూర్చోపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హెల్మెట్‌లోని పాము బయటకు తొంగిచూడటంతో ఒక్కసారిగా దడుసుకున్నారు. ఆ తరువాత పాములను పట్టేవారికి సమాచారం ఇచ్చారు. అతడొచ్చి హెల్మెట్‌లో కర్రతో అటూఇటూ కదపడంతో మరోసారి పాము బయటకు వచ్చింది. మరోవైపు, స్థానికులు వాహనదారుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.