WhatsApp Tricks: వాట్సాప్‌లో టైప్ చేయకుండా మెసేజ్‌లు పంపే ట్రిక్ మీకు తెలుసా?
Tech Tricks: వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని పనులు మరింత సులభతరం అయ్యాయి. ఏదైనా మెసేజ్‌ను పంపాలంటే, దాన్ని టైప్ చేసి పంపాల్సి ఉంటుంది. కానీ సందేశం ఎక్కువగా ఉంటే టైప్ చేయడం ఇబ్బందిగానే ఉండేది. కానీ ఇప్పుడు వాయిస్‌తోనే మెసేజ్ టైపింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి..

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. రోజూ లెక్కలేనన్ని సందేశాలు పంపుకొంటున్నారు. వాట్సాప్ లేదా ఇతర యాప్‌లలో మెసేజ్‌లను టైప్ చేసి పంపడం అందరికీ తెలిసిన విషయమే. అయితే, వాట్సాప్‌లో చాట్ చేయడం కొన్నిసార్లు మీరు సుదీర్ఘ సందేశాలను రాయాల్సి వచ్చినప్పుడు బోరింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా మీరు బయట ఉన్నప్పుడు, డ్రైవింగ్ లేదా ఏదైనా ఇతర కార్యకలాపంలో బిజీగా ఉన్నప్పుడు టైప్ చేయడం కష్టంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో ఏమి చేయాలి?
మీరు వాట్సాప్‌లో టైప్ చేయకుండానే టెక్స్ట్ మెసేజ్ పంపవచ్చు. ఈ ఫీచర్ మీ వాయిస్ ఆధారంగా పని చేస్తుంది. అంటే మీరు మాట్లాడడం ద్వారా మీరు పంపాలనుకుంటున్న సందేశాన్ని చెప్పాలి. అలాగే మీరు చెప్పినది స్వయంచాలకంగా టైప్ అవుతూనే ఉంటుంది. దీని కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి గూగుల్ ఇండిక్ కీబోర్డ్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. ఇది అన్ని భాషలకు సపోర్ట్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: Success Story: ఇంటర్ ఫెయిల్.. 7 రోజుల్లో రూ.336 కోట్లు సంపాదించిన వ్యాపారి సక్సెస్ స్టోరీ
ఇండిక్ కీబోర్డ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత WhatsApp తెరవండి. ఆపై మీరు సందేశం పంపాలనుకుంటున్న వ్యక్తి చాట్‌కి వెళ్లండి. ఇప్పుడు సందేశాన్ని టైప్ చేయడానికి కీబోర్డ్‌ను ఓపెన్ చేయండి. అదనపు కీబోర్డ్‌లు ఎగువన మైక్ గుర్తును కలిగి ఉంటాయి. దాన్ని నొక్కండి. కానీ, వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లు పంపడానికి కూడా మైక్ అందించబడిందని గమనించండి. మీరు ఆ మైక్‌ని ఉపయోగించవద్దు. మీరు కీబోర్డ్‌లోని మైక్‌ను మాత్రమే ఉపయోగించాలి.
ఇప్పుడు మీ ముందు మైక్ కనిపిస్తుంది. మాట్లాడమని కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు పంపాలనుకుంటున్న సందేశాన్ని మాత్రమే మాట్లాడండి. మీ సందేశం పూర్తయిన తర్వాత మైక్ చిహ్నాన్ని నొక్కండి. ఇక్కడ విశేషమేమిటంటే, నేడు చాలా కీబోర్డ్‌లు ఇంగ్లీషు భాషతో పాటు ప్రాంతీయ భాషలను కూడా సపోర్ట్ చేస్తున్నాయి. మీరు మాట్లాడినవన్నీ ఇక్కడ టైప్ అవుతాయి. తర్వాత సెండ్ బటన్ నొక్కితే సరిపోతుంది.
Google ద్వారా కూడా పంపవచ్చు:
వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు పంపేందుకు గూగుల్ కూడా సహకరిస్తోంది. Google ఫోల్డర్ లేదా యాప్ డ్రాయర్ నుండి Google యాప్‌ని తెరిచి, బిగ్గరగా ‘OK Google’ అని చెప్పండి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం వాట్సాప్‌లో సుదీర్ఘ సందేశాన్ని టైప్ చేయడానికి బదులుగా, పంపవలసిన సందేశాన్ని చెప్పండి. అప్పుడు ఏ సందేశం పంపాలని గూగుల్ అడుగుతుంది. ఈ విధంగా మీరు ఎలాంటి టైపింగ్ సమస్య లేకుండా WhatsApp సందేశాన్ని పంపవచ్చు.
ఇది కూడా చదవండి: మద్యం ప్రియులకు కిక్కిచ్చే వార్త.. వైన్స్ షాపులు, బార్ల సమయ వేళల పొడిగింపు!
ఇది కూడా చదవండి: Banks Holiday: కొత్త సంవత్సరం జనవరి 1న బ్యాంకులు మూసి ఉంటాయా..? లేదా?
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








