AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం ప్రియులకు కిక్కిచ్చే వార్త.. వైన్స్‌ షాపులు, బార్ల సమయ వేళల పొడిగింపు!

Telangana: ఇది మద్యం ప్రియులకు శుభవార్తేనని చెప్పాలి. డిసెంబర్‌ 31న పార్టీలతో మునిగి తేలుతుంటారు. ఈ నేపథ్యంలో మద్యం షాపులు, బార్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటి సమయ వేళలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మందు పార్టీ చేసుకునేందుకు ముందుగానే ప్రిపెర్‌ అవుతుంటారు..

మద్యం ప్రియులకు కిక్కిచ్చే వార్త.. వైన్స్‌ షాపులు, బార్ల సమయ వేళల పొడిగింపు!
Subhash Goud
|

Updated on: Dec 30, 2024 | 5:22 PM

Share

ఈ ఏడాది ముగియబోతోంది. ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ డిసెంబర్‌ 31న పార్టీతో ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక డిసెంబర్‌ 31న మద్యం ప్రియులకు పండగే.. పండగ. మందు పార్టీ చేసుకునేందుకు ముందుగానే ప్రిపెర్‌ అవుతుంటారు. కొందరైతే 31 కోసం ముందస్తుగానే మద్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. మద్యం షాపులకు ఫుల్లు గిరాకీ. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న వైన్స్‌ షాపులు సమయ వేళలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే బార్‌లు, రెస్టారెంట్‌లు కూడా తెల్లవారుజామున 1:00 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఈ మార్పులను ధృవీకరిస్తూ ఎక్సైజ్ శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రభుత్వం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు, కార్యక్రమాలను గ్రీన్‌లైట్ చేసింది.

ఇది కూడా చదవండి: Jio Plans: కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో.. మారిన ప్లాన్స్‌!

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) కొన్ని షరతులకు లోబడి తన అధికార పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసింది. పార్టీలు, పబ్‌లలో డ్రగ్స్‌ వాడకుండా చూడాలని ఈవెంట్‌ నిర్వాహకులను ఆదేశించారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్‌ వినియోగాన్ని నిరోధించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, వైన్ షాపులను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడానికి అనుమతించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Success Story: ఇంటర్‌ ఫెయిల్‌.. 7 రోజుల్లో రూ.336 కోట్లు సంపాదించిన వ్యాపారి సక్సెస్‌ స్టోరీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి