Hyderabad Metro: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. మెట్రో రైలు సమయ వేళల పొడిగింపు!

Hyderabad Metro: ఈ ఏడాదికి వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి స్వాగతం పలుకనున్నారు ప్రజలు. డిసెంబర్‌ 31న వేడుకలలో ఎంజాయ్‌ చేయనున్నారు. ఇక హైదరాబాద్‌ వాసుల ఎంజాయ్‌మెంట్‌ అంతా ఇంతా కాదు. నగర వాసులు డిసెంబర్‌ 31న వేడుకల్లో మునిగి తేలనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది..

Hyderabad Metro: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. మెట్రో రైలు సమయ వేళల పొడిగింపు!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 30, 2024 | 6:37 PM

ఈ ఏడాది ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి దేశ ప్రజలు స్వాగతం పలకనున్నారు. కొత్త ఏడాది ముగింపులో డిసెంబర్‌ 31న అందరు ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ పార్టీలతో మునిగి తేలుతుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్‌ సందర్భంగా మెట్రో రైలు వేళలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు అర్థరాత్రి 12: 30 గంటలకు వరకు మెట్రో సర్వీసులు కొనసాగనున్నాయి.

కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్‌ 31న వేడులకు జరుపుకొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హైదరాబాద్‌ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మరిన్ని మెట్రో రైళ్లను నడపున్నట్లు తెలిపింది. అర్థరాత్రి వరకు వేడుకలు జరుపుకొని సురక్షితంగా ఇంటికి వెళ్లేందుకు ఈ సమయం వేళలు పొడిగించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇ క్కడ క్లిక్ చేయండి