RBI rule: మీ డెబిట్ కార్డులో ఈ 3 మార్పులు చేసుకున్నారా.. అయితే వెంటనే చేసుకోమంటున్న ఆర్‌బీఐ..

భారత కరెన్సీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే RBI కూడా పౌరులకు చాలా విషయాలపై అవగాహన కలిగిస్తోంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ వినియోగం పెరుగుతున్నప్పటి నుంచి సైబర్ క్రైమ్ కూడా పెరిగింది.

RBI rule: మీ డెబిట్ కార్డులో ఈ 3 మార్పులు చేసుకున్నారా.. అయితే వెంటనే చేసుకోమంటున్న ఆర్‌బీఐ..
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 01, 2021 | 6:55 PM

భారత కరెన్సీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే RBI కూడా పౌరులకు దేశం గురించి అవగాహన కలిగిస్తుంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ వినియోగం పెరుగుతున్నప్పటి నుండి సైబర్ క్రైమ్ కూడా పెరిగింది. అటువంటి పరిస్థితిలో డెబిట్ కార్డు హోల్డర్లు తమ కార్డు సెట్టింగులను మార్చమని RBI కోరింది. RBI ఇచ్చిన సూచనలను అవలంబించడం ద్వారా మోసానికి అవకాశం మోసం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు.

ఇప్పుడు చాలా మంది బ్యాంక్ ఖాతాదారులు డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. కానీ కొన్నిసార్లు కొంత అజాగ్రత్త కారణంగా వారు సైబర్ క్రైమినల్స్ బారిలో చిక్కుకుంటారు. RBI సలహాతో మీరు వాటిని నివారించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు డెబిట్ కార్డు సెట్టింగ్‌ను ఎలా మార్చవచ్చో మీకు తెలుసా..? RBI మార్చమని అడిగిన సెట్టింగులు ఏమిటి…?

ఏ సెట్టింగులను మార్చమని ఆర్బిఐ చెప్పింది?

అవగాహన కోసం RBI  అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ సమాచారం షేర్ చేసింది . కార్డును సురక్షితంగా ఉంచడానికి కొన్ని  చిట్కాలను చెప్పింది. RBI ప్రకారం ఈ సెట్టింగులను మార్చుకుంటే సరిపోతుంది.

మీ డెబిట్ కార్డులో రోజువారీ లావాదేవీలకు పరిమితి ఉంటుంది. మీ అవసరానికి అనుగుణంగా సరి సెచ్ చేసుకోండి. కాబట్టి  ఎవరైనా మోసం చేయాలనుకుంటే ఇక చేయలేడు. ఇది కాకుండా ఏదైనా నకిలీ లావాదేవీలు కూడా చేయలేడు.

– ఆర్‌బిఐ ఇచ్చిన సమాచారం ప్రకారం…  మీ డెబిట్ కార్డులో దేశీయ / అంతర్జాతీయ వినియోగానికి పరిమితిని నిర్ణయించండి. అవసరమైతే మీరు దాన్ని పెంచవచ్చు. కాని అవసరం లేనప్పుడు తగ్గించండి.

– మీరు అంతర్జాతీయ లావాదేవీల కోసం కార్డును ఉపయోగించకపోతే.. ఆ సట్టింగ్‌ను నిలివేయండి. వాస్తవానికి అంతర్జాతీయ మోసాలు చాలా పెరిగాయి. మీరు అంతర్జాతీయ లావాదేవీని ఆపివేస్తే.. ఇక మీరు మోసపోవడానికి ఛాన్స్ ఉండదు. ఈ పద్ధతులు మోసం వల్ల కలిగే నష్టంతోపాటు.. మీ ఖర్చులను రెండింటినీ తగ్గించుకోవచ్చంటోంది ఆర్‌బిఐ.

ఎలా మార్చవచ్చు?

డెబిట్ కార్డులోని లావాదేవీల పరిమితిని మీరే స్వయంగా సెట్ చేసుకోవచ్చు.  ఈ సెట్టింగ్‌ను మార్చడానికి, మీరు ప్రతి బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి… నెట్ బ్యాంకింగ్ ద్వారా దీనిని మార్చవచ్చు.

ఇవి కూడా చదవండి : Shakeela Help: ఆకలి తీర్చే దేవతగా మారిన షకీలా..! కుక్ విత్ క్లౌన్ షో నుంచి సేవారంగంలోకి…

మెట్రో ప్రయాణికులకు ముఖ్య సూచన.. ఈ రోజు నుంచి రైలు వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్

RBI clears on Cryptocurrency: క్రిప్టో క‌రెన్సీ ఇన్వెస్ట‌ర్ల‌కు RBI గుడ్ న్యూస్..! ఆర్థిక సంస్థ‌లకు సూచనలు...

Good News: ఈ రోజు నుంచి మార్కెట్లోకి రానున్న డీఆర్‌డీవో మందు.. అందుబాటులోకి 6-8 లక్షల 2డీజీ మెడిసిన్ ప్యాకెట్లు

Good News: జూన్‌లో జోరందుకోనున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన

New Rules From Today: ఈ రోజు నుంచి చాలా మారిపోతున్నాయి..! గమనించారా..! అయితే మీ ఇష్టం..!