AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: జూన్‌లో జోరందుకోనున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన

Covid Vaccine: దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జూన్ మాసంలో జోరందుకోనుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన మూడు వ్యాక్సిన్లు (కొవిషీల్డ్, కొవాక్సిన్, స్పుట్నిక్ వీ)తో పాటు...మరికొన్ని విదేశీ వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

Good News: జూన్‌లో జోరందుకోనున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన
Covid Vaccine
Janardhan Veluru
|

Updated on: May 31, 2021 | 8:16 PM

Share

దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జూన్ మాసంలో జోరందుకోనుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన మూడు వ్యాక్సిన్లు (కొవిషీల్డ్, కొవాక్సిన్, స్పుట్నిక్ వీ)తో పాటు…మరికొన్ని విదేశీ వ్యాక్సిన్లు త్వరలోనే దేశ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అటు దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి స్పీడ్ అందుకుంది. కొవిషీల్డ్, కొవాక్జిన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్‌లు చొరవచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. జూన్ మాసంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 12 కోట్ల డోస్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రకటించింది. తద్వారా గణనీయమైన సంఖ్యలో రాష్ట్రాలు వ్యాక్సినేషన్ చేపట్టవచ్చని పేర్కొంది. భారీ సంఖ్యలో కొవిడ్ డోస్‌లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రాష్ట్రాలు తమ దగ్గరున్న బఫర్ స్టాక్‌ను త్వరగా పూర్తి చేయాలని సూచించింది. వ్యాక్సిన్ల కొరతపై పలు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తంచేస్తుండటం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ సీనియర్లు విమర్శిస్తున్నారు.

10 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనున్న సీరమ్ జూన్ మాసంలో దాదాపు 9 నుంచి 10 కోట్ల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి సరఫరా చేయనున్నట్లు సీరమ్ సంస్థ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు రెండ్రోజుల క్రితం రాసిన లేఖలో తెలిపింది. వ్యాక్సిన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు తమ ఉద్యోగులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది. మే మాసంలో తమ ఉత్పత్తి సామర్థ్యం 6.5 కోట్ల డోస్‌లు కాగా…దీన్ని 10 కోట్లకు పెంచనున్నట్లు వెల్లడించింది. అటు భారత్ బయోటెక్ కూడా మే మాసంతో పోలిస్తే జూన్ మాసంలో వ్యాక్సిన్ల(కొవాక్జిన్) ఉత్పత్తిని గణనీయంగా పెంచనుంది.

Covid Vaccine

Covid Vaccine

ఈ సంవత్సరం చివరినాటికల్లా దేశంలోని అందరికీ కొవిడ్ వ్యాక్సిన్లు అందేలా చూస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ రెండ్రోజుల క్రితం ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా? అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్(AIIMS) చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందు ముందు జోరందుకోనున్నట్లు చెప్పారు. జులై మాసం చివరి నాటికి దేశంలో ప్రతి రోజు కోటి మందికి వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశమున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!

బాతు పిల్లలతో కుక్క పిల్ల క్రేజీ ఆటలు.. నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో..