AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!

Corona Cases Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 నమూనాలను పరీక్షించగా..

తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!
Ravi Kiran
|

Updated on: May 31, 2021 | 8:12 PM

Share

Corona Cases Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 నమూనాలను పరీక్షించగా 2,524 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,78,351కి చేరింది. మరో 18 మంది కరోనా కారణంగా మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 3281కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 34,084 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న 3,464 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా 5,40,986 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 307 మందికి పాజిటివ్‌గా తేలింది.

గ్రేటర్‌లో నేడు 24,897 మందికి వ్యాక్సిన్…

కరోనా కట్టడిలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం నాడు 24,897 మందికి వ్యాక్సిన్ వేశారు. నేడు గ్రేటర్ హైదరాబాద్‌లోని 31 కేంద్రాల్లో కొనసాగిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగింది. ఈ వ్యాక్సినేషన్ కేంద్రాలను పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో జిహెచ్ఎంసిలో అమలు చేస్తున్న అన్నపూర్ణ ఉచిత భోజనం కార్యక్రమంలో భాగంగా నేడు 75,600 ఉచిత భోజనాలను పంపిణీ చేయడం జరిగింది. గ్రేటర్‌లో రెండో విడత ఫీవర్ సర్వేలో భాగంగా 90,567 ఇళ్లలో ఫీవర్ సర్వే నిర్వహించారు.

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?