కోవిడ్ బాధితులకు భరోసా.. నేనున్నానని ఆదుకుంటున్న వేముల
కరోనా వైరస్ సోకిదంటేనే ఆమడ దూరం పారిపోయే పరిస్థితులు ఉన్నాయి. చివరికి సొంత కుటుంబ సభ్యులు సైతం కరోనా బాధితులను పట్టించుకోని ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఆపత్కాలంలో...
కరోనా వైరస్ సోకిదంటేనే ఆమడ దూరం పారిపోయే పరిస్థితులు ఉన్నాయి. చివరికి సొంత కుటుంబ సభ్యులు సైతం కరోనా బాధితులను పట్టించుకోని ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఆపత్కాలంలో కరోనా బాధితులకు తానున్నానంటూ ధైర్యం చెబుతున్నారు నకిరెకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. కరోనా బాధితులకు ఏం అవసరం వచ్చినా తనను సంప్రదించాలంటూ భరోసా ఇస్తున్నారు. అధికారంలో లేకపోయినప్పటికీ.. తన సొంతఖర్చులతో బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కరోనా బాధితులను నేరుగా కలిసి మనో ధైర్యం కల్పిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని కరోనా బాధితులను కలిసి వారిలో రోగ నిరోధక శక్తిని పెంచే 17 రకాల వస్తులతో కూడిన కిట్లు అందజేస్తున్నారు.
ఇదిలాఉంటే.. నేడు (జూన్ 1) వేముల వీరేశం పుట్టిన రోజు కావడంతో.. తన జన్మదిన వేడుకల నిర్వహించొద్దని టీఆర్ఎస్ శ్రేణులకు, తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకలు నిర్వహించే బదులుగా కరోనా బాధితులకు సహాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. వేముల వీరేశం పిలుపుతో నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో కరోనా బారిన పడిన వారికి ఆయన అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు రోగ నిరోధక శక్తిని పెంచే కిట్లను అందజేస్తున్నారు. బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, పండ్లు ఇతర వస్తువులతో కూడిన కిట్లను అందజేస్తున్నారు. కరోనా సోకడంతో అయినవారే అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న ఈసమయంలో వేముల వీరేశం చేస్తున్న ఈ సహాయ సహకారాల పట్ల బాధితులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆయన ఆయురాగ్యోగాలతో ఉండాలని దీవిస్తున్నారు.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కరోనాతో చనిపోయిన బాధితుల అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులే వెనుకాడుతున్న సమయంలో తానే కుటుంబ సభ్యునిగా మారి ముందు నడుస్తున్నాడు వేముల వీరేశం. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలను దగ్గరుండి జరిపిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించి తానున్నాంటూ, అధైర్య పడొద్దంటూ భరోసా ఇస్తున్నారు. వారికి చేయూతనిస్తూ ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.
Also Read: Road Accident: వనస్థలిపురంలో బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్.. దంపతుల దుర్మరణం..
మందు బాబులు ఖుషీ ! ఆంక్షలున్నా ఢిల్లీలో హోం డెలివరీ ద్వారా స్వదేశీ, విదేశీ మద్యం , నిబంధనలు సరళతరం