- Telugu News Photo Gallery Business photos State bank of india life sampoorn suraksha is a insurance plan offered insurance up to rs 40 lakhs
SBI Insurance: గుడ్‌న్యూస్ .. ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పాలసీ.. రూ.40 లక్షల వరకు లైఫ్ కవరేజీతో ..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఖాతా ఉంటే మీకో గుడ్‌న్యూస్. మీరు రూ.40 లక్షల వరకు ఇన్‌స్టంట్ లైఫ్ కవర్‌తో ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ సురక్ష ..
Updated on: Jun 01, 2021 | 2:37 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఖాతా ఉంటే మీకో గుడ్‌న్యూస్. మీరు రూ.40 లక్షల వరకు ఇన్‌స్టంట్ లైఫ్ కవర్‌తో ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ సురక్ష పేరుతో అందిస్తున్న ప్రత్యేక పాలసీ ఇది. ఎస్‌బీఐ కస్టమర్లు ఎవరైనా ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఎస్‌బీఐ యోనో ప్లా్‌ట్‌ఫామ్‌లో కేవలం కొన్ని క్లిక్స్‌తో సులభంగా ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పాలసీ తీసుకోవచ్చు. ఇది గ్రూప్, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ.

ఈ పాలసీ తీసుకున్నవారికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులకు ఈ పాలసీ ఆర్థికంగా మద్దతుగా నిలుస్తుంది. కనీసం రూ.1,00,000 నుంచి రూ.40,00,000 వరకు పాలసీ తీసుకోవచ్చు. ఎంచుకున్న పాలసీ మొత్తాన్ని బట్టి ప్రీమియం ఉంటుంది. ప్రతీ ఏటా ప్రీమియం కస్టమర్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది.

ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పాలసీ తీసుకోవాలంటే కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 55 ఏళ్లు. పాలసీ టర్మ్ సంవత్సరం మాత్రమే. 55 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రెన్యువల్ చేయవచ్చు. ఈపాలసీ తీసుకున్నవారు మరణిస్తే సమ్ అష్యూర్డ్ నామినీకి అందిస్తారు. రైడర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ఈ పాలసీపై ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎస్‌బీఐ యోనో ప్లాట్‌ఫామ్‌లో ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పాలసీ తీసుకోవడానికి యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత insurance సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ Buy a Policy ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయాలి. ఆ తర్వాత SBI Life - Sampoorn Surakasha ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత పుట్టిన తేదీ, నామినీ వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాతి సెక్షన్‌లో హైట్, వెయిట్ సెలెక్ట్ చేయాలి. ఏవైనా అనారోగ్యాలు ఉంటే ఆ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. అలాగే చివరగా పేమెంట్ కూడా అక్కడే పూర్తి చేయవచ్చు.




