- Telugu News Photo Gallery Business photos Railways records highest ever freight load of 114 8 metric tonne in may
Indian Railways Records: కరోనా మహమ్మారి సమయంలో సరుకుల రవాణాలో రికార్డు సృష్టించిన భారత రైల్వే శాఖ
భారతీయ రైల్వే మరో రికార్డు సృష్టించింది. మే నెలలో అత్యధికంగా సరుకుల రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కోవిడ్ సంక్షోభం సమయంలో గత నెలలో 114.8 మిలియన్ టన్నులు ..
Updated on: Jun 02, 2021 | 11:43 AM

భారతీయ రైల్వే మరో రికార్డు సృష్టించింది. మే నెలలో అత్యధికంగా సరుకుల రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కోవిడ్ సంక్షోభం సమయంలో గత నెలలో 114.8 మిలియన్ టన్నులు రవాణా చేసింది. మే 2019లో 104.6 టన్నుల సరుకు రవాణా చేసింది.

ఇప్పటి వరకు అదే అత్యధికం కాగా, ఇప్పుడా రికార్డు బద్దలైంది. 2019 మేతో పోలిస్తే ఇది 9.7 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. భారతీయ రైల్వేకు గత నెలలో ఆదాయం, సరుకు రవాణా ఎక్కువగా ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

మే నెలలో చేసిన మొత్తం సరుకు రవాణాలో 54.52 మిలియన్ టన్నుల బొగ్గు, 15.12 మిలియన్ టన్నుల ఇనుప రజను, 5.61 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 3.68 మిలియన్ టన్నుల ఎరువులు, 3.18 మిలియన్ టన్నుల మినరల్ అయిల్, 5.36 మిలియన్ టన్నుల సిమెంట్, 4.2 మిలియన్ టన్నుల క్లింకర్ ఉన్నట్టు రైల్వే పేర్కొంది. ఫలితంగా గత నెలలో 11,604 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మే నెలలో వేగన్ టర్న్ అరౌండ్ టైమ్ 26 శాతం మెరుగైందని రైల్వే పేర్కొంది.




