తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
తెలంగాణలో లాక్‌డౌన్, కరోనా పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 15 వరకు..
తెలంగాణలో లాక్‌డౌన్, కరోనా పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 15 వరకు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. డైట్ కళాశాలలకు కూడా జూన్ 15 వరకు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణను పరిశీలించాలన్న కేటీఆర్ సూచనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ఆన్‌లైన్ పద్దతిలో గ్రామీణ విద్యార్థులకు చేరువయ్యే మార్గాలు ఆన్వేషిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి పరిష్కారం లభిస్తుందని మంత్రి చెప్పారు. వేసవి సెలవుల్లో ఇంటర్ ఆన్లైన్ క్లాసులు మొదలుపెట్టాలని ప్రిన్సిపల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. అటు ఇంటర్ ఆన్లైన్ తరగతులు రేపట్నుంచి ప్రారంభించాల్సి ఉండగా.. అది కాస్తా వాయిదా పడింది. సవరించిన షెడ్యూల్ సాయంత్రంలోగా రానుంది.