MLA Free Food: జస్ట్ ఒక్క ఫోన్ చాలు.. కోవిడ్ బాధితుల ఇంటికే ఉచిత పౌష్టికాహారం.. అన్నార్థులకు అండగా నిజామాబాద్ ఎమ్మెల్యే..!
కోవిడ్ పేషెంట్లు, వారి బందువులకు అన్నపూర్ణగా మారుతుంది నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆలోచన. గత లాక్‌డౌన్ నుంచి వేలాది మంది ఆకలి తీర్చిన ఎమ్మెల్యే.
MLA Ganesh Gupta Humanity: పక్కింట్లో కరోనా వచ్చిందని తెలిస్తే.. మనింటి తలుపులు, కిటికీలు మూసేసుకొని బతుకుతున్న రోజులు ఇవి.. ఇక.. మనింట్లోనే.. ఎవరికైనా పాజిటివ్ అని తేలితే.. భయంభయంగా బతికే మనస్తత్వాలు మనవి. సొంతవాళ్లే అయినా.. దగ్గరికి వెళ్లేందుకు కూడా సాహసం చేయలేని పరిస్థితులు. వాళ్ల ఆకలి తీర్చేందుకు.. భోజనం ప్లేట్ వాళ్లకిచ్చేందుకు కూడా పది సార్లు ఆలోచిస్తున్న దుస్థతి. అలాంటిది.. కోవిడ్ పేషెంట్లు, వారి బందువులకు అన్నపూర్ణగా మారుతుంది నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆలోచన. గత లాక్‌డౌన్‌లో వేలాది మంది ఆకలి తీర్చిన ఎమ్మెల్యే గణేష్ బిగాల.. ఇప్పుడు మరోసారి కోవిడ్ బాధితులు వారి బందువుల ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఒక్క ఫోన్ కాల్‌తో కోవిడ్ భాదితుల ఇంటికే అహరం చేరేలా ప్రణాళిక చేశారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల. ఎమ్మెల్యే తండ్రి బిగాల కృష్ణమూర్తి పేరుతో అహర పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతేడాది లాక్ డౌన్ సమయంలో 41 రోజుల పాటు నిత్యం రెండు వేల మందికి అహరం పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణేష్ బిగాల.. ఇప్పుడు రోజుకు 1,500 మందికి ఉచితంగా అహరం అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో 8 వాహనాలతో పుడ్ ప్యాకేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఉపాధి కోల్పోయిన వారితో పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి నేరుగా ఇంటికే అహార పదార్ధాలను చేరవేస్తున్నారు. కరోనాతో బాధపడుతున్న బాధితులతో పాటు, అస్పత్రుల వద్ద వారి బందువుల ఆకలి సైతం తీరుస్తున్నారు. ఇందుకోసం నిత్యం ఎనిమిది వాహనాలకు ఒక్కో రూట్‌లో ఏర్పాటు చేసి ఏరియా వారిగా కాల్ సెంటర్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లా కేంద్రంలో ఎర్పాటు చేసిన పుడ్ డిస్ట్రిబ్యూషన్ కు మంచి రేస్పాన్స్ వస్తుంది. ఇక రోజు వారిగా అందిస్తున్నా పుడ్ తమ ఆకలి తీర్చుతుందంటున్నారు బాధితులు. రుచికరమైన బోజనం అందిస్తున్నారని.. తమకు కోవిడ్ కాలంలో అండగా ఉంటుందని చెబుతున్నారు.. ప్రతి రోజు సమయానికి బోజనం రావడంతో ఇబ్బందులు తప్పాయంటున్నారు.
ఇక, కష్టాల్లో ఉన్నా వారు వంట చేసుకునే పరిస్థితులు లేక, పౌష్టికాహారం తినలేక ఇబ్బందిపడుతున్న వాళ్లకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామంటున్నారు ఎమ్మెల్యే గణేష్ బిగాల. నగరంలో పుడ్ లేని పేదలతో పాటు కరోనా బాధితులకు వారి బందువులకు అండగా ఉంటామంటున్నారు. ఎంత మందికి అందిచడానైకా సిద్దంగా ఉన్నామన్నారు. కోవిడ్ బాధితులకు అందిస్తున్న ఆహారం నాలుగు నుండి ఐదు రకాల రుచులతో.. మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఎమ్మెల్యే గణేష్ గుప్తా తెలిపారు. ఈ వంటల తయారీలోనూ పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. జస్ట్ ఒక్క ఫోన్ చేస్తే చాలు.. వందలాది కోవిడ్ బాధితులకు ఉచితంగానే పౌష్టికాహారాన్ని పొందవచ్చాని స్పష్టం చేశారు. లాక్ డౌన్ అయిపోయే వరకు అందిస్తామంటున్నా ఎమ్మెల్యే, అన్నార్థులకు అండగా ఉంటామంటున్నారు.
Read Also… అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.7 ఆదా చేస్తే నెలకు రూ.5 వేలు మీ చేతికి.. ఎలాగంటే..