తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. రేపట్నుంచి బ్యాంక్ పనివేళల్లో మార్పులు.. పూర్తి వివరాలు..
తెలంగాణలో మరో 10 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపధ్యంలో రేపట్నుంచి బ్యాంకుల పనివేళలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. జూన్ 1..
తెలంగాణలో మరో 10 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపధ్యంలో రేపట్నుంచి బ్యాంకుల పనివేళలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులన్నీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నాయి. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేయగా. రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ప్రకటించడంతో.. బ్యాంకుల టైమింగ్స్‌లో కూడా మార్పు చేస్తున్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కీలక ప్రకటన చేసింది. మారిన పనివేళలు రేపట్నుంచి అమలులోకి రానుండగా.. జూన్ 9వ తేదీ వరకు ఇవి వర్తించనున్నాయి.
తెలంగాణలో లాక్‌డౌన్‌ను మళ్లీ 10 రోజులు పొడిగింపు…
తెలంగాణలో లాక్‌డౌన్‌ను మళ్లీ 10 రోజుల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం సమావేశమైన మంత్రి మండలి జూన్ 9 వరకూ లాక్‌డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ఉన్న సడలింపు సమయాన్ని పెంచారు. మధ్యాహ్నం 1 గంట వరకు సండలింపు ఉంటుందని.. దీంతోపాటు బయటకు వెళ్లిన వారు ఇళ్లకు వెళ్లేందుకు 2 గంటల వరకూ సమయం ఇచ్చారు. అనంతరం 2 గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.