RBI clears on Cryptocurrency: క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు RBI గుడ్ న్యూస్..! ఆర్థిక సంస్థలకు సూచనలు..
RBI clears on Cryptocurrency: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టపెట్టేవారికి గుడ్ న్యూస్. దేశీయ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు ఆర్బీఐ గొప్ప న్యూస్ చెప్పింది. కస్టమర్ల శ్రద్ధను దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ...
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టపెట్టేవారికి గుడ్ న్యూస్. దేశీయ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు ఆర్బీఐ గొప్ప న్యూస్ చెప్పింది. కస్టమర్ల శ్రద్ధను దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఈ విరణ ఇచ్చింది. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిషేధిస్తూ 2018లో జారీ చేసిన వివరణను వాడొద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు సూచించింది.
దేశంలో క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలను నిషేధిస్తూ.. 2018 ఏప్రిల్ ఆరో తేదీన RBI ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2018 నాటి RBI ఆదేశాలను పక్కన బెడుతూ గతేడాది మార్చి నాలుగో తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో 2018 ఆదేశాలు నిరర్ధకమని RBI తెపింది.
క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు జరుపొద్దని HDFC బ్యాంక్, SBI కార్డు వంటి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారులను హెచ్చరించిన నేపథ్యంలో RBI వివరణ ఇచ్చింది. బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలతో లావాదేవీల నిర్వహణకు RBI లైసెన్స్ ఇవ్వలేదని SBI కార్డు తెలిపింది.
ఒకవేళ బిట్ కాయిన్ వంటి ఏదేనీ వర్చవల్ కరెన్సీతో గానీ, క్రిప్టో కరెన్సీతో గానీ లావాదేవీలు జరిపితే ఖాతాదారులకు జారీ చేసిన క్రెడిట్ కార్డులను రద్దు లేదా సస్పెండ్ చేస్తామన్నది. RBI గైడ్ లైన్స్ ప్రకారం క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు జరిపిన కస్టమర్లు 30 రోజుల్లో తమ శాఖను సంప్రదించాలని సూచించింది.
RBI ఒక నోటిఫికేషన్లో, “RBI సర్క్యులర్ డిబిఆర్.నో.బి.పి.బి.సి .104 / 08.13 కు సూచన ఇవ్వడం ద్వారా కొన్ని బ్యాంకులు / నియంత్రిత సంస్థలు వర్చువల్ కరెన్సీలతో వ్యవహరించకుండా తమ వినియోగదారులను హెచ్చరించాయని మీడియా నివేదికల ద్వారా మా దృష్టికి వచ్చింది. .102 / 2017-18 ఏప్రిల్ 06, 2018. బ్యాంకులు / నియంత్రిత సంస్థలచే పైన పేర్కొన్న సర్క్యులర్‌కు సంబంధించిన సూచనలు . ఎందుకంటే ఈ సర్క్యులర్‌ను గౌరవ సుప్రీంకోర్టు 2020 మార్చి 04 న రిట్ విషయంలో పక్కన పెట్టింది. పిటిషన్ (సివిల్) 2018 నెం .528 (Internet and Mobile Association of India v. Reserve Bank of India).. ”
సోమవారం జారీ చేసిన ఈ సర్క్యులర్ అన్ని వాణిజ్య మరియు సహకార బ్యాంకులు, చెల్లింపుల బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు మరియు చెల్లింపు వ్యవస్థ ప్రొవైడర్లను ఉద్దేశించి ఉంటుంది.