Egg Rate Today: గుడ్డు కావాలా నాయనా..! అయితే ధర ఎంతో తెలుసుకో…!
Egg Rate Today: కరోనా కోడి గుడ్డుపై ప్రభావం కనిపిస్తోంది. మంచి ఆహారం తీసుకోవాలనే కాన్సెప్ట్ పెరిగిపోవడంతో చాలా మంది గుడ్డుపై దృష్టి పెట్టారు. దీంతో గుడ్డు ధర ఇప్పుడు గుండె గుభేల్ పుట్టిస్తోంది.
కరోనా కోడి గుడ్డుపై ప్రభావం కనిపిస్తోంది. మంచి ఆహారం తీసుకోవాలనే కాన్సెప్ట్ పెరిగిపోవడంతో చాలా మంది గుడ్డుపై దృష్టి పెట్టారు. దీంతో గుడ్డు ధర ఇప్పుడు గుండె గుభేల్ పుట్టిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధరలు రోజురోజుకూ కొండెక్కుతున్నాయి. ఓవైపు వినియోగం గణనీయంగా పెరగటం.. అదే స్థాయిలో ఉత్పత్తి లేక పోవడంతో ధర రోజు రోజుకు పెరుగుతోంది. ఇదొక్కటే కాకుండా వేసవి సమయంలో ఉత్తత్తి తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
హోల్‌సేల్ ధరలు ఎలా ఉన్నా.. రిటైల్ వ్యాపారులు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. ఒక్కో గుడ్డు ధర రూ. 6.25 నుంచి రూ.7 వరకూ ఇష్టారీతిన అమ్ముతున్నారు. కొనేవారు పెగుతుండటంతో రిటైల్ వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో వాటి వినియోగం గణనీయంగా పెరగడంతో గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
లాక్‌డౌన్ సమయానికి వాటి దాణా ధరలు 50 శాతం వరకూ పెరిగిపోయాని అంటున్నారు పౌల్టీ నిర్వాహకులు. ఈ తరుణంలో గుడ్లు పెట్టే కోళ్లకు దాణా వేయడం రైతుకు చాలా ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. కరోనా వేళ వీటి వినియోగం బాగా పెరిగింది. ఇది వరకూ డజను చొప్పున కొన్నవారు.. ఇప్పుడు ట్రేలో ఎన్ని ఉంటే అన్ని తీసుకెళ్తున్నారు.
గ్రామాల్లోనూ వినియోగం పెరిగిందని.. అదే సమయంలో వాటి ఉత్పత్తి తక్కువవడం వల్ల ధరలు పెరిగాయని అంటున్నారు పౌల్ట్రీ యాజమాన్యాలు. తెలంగాణలో ఈ రోజు హోల్ సేల్ ధర 3.75 ఉంది.