Xiaomi Hyper Charge: సరికొత్త టెక్నాలజీతో షియోమి ఫాస్ట్‌ చార్జర్స్‌.. కేవలం 8 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌

Xiaomi Hyper Charge: మొబైల్ రంగంలో సంచనాలకు తెరులేపుతున్న చైనాకు చెందిన షియోమి.. ఇప్పుడు మరో సంచలనానికి రెడీ అవుతోంది. కొత్త టెక్నాలజీతో కూడిన ఫోన్లు,..

Xiaomi Hyper Charge: సరికొత్త టెక్నాలజీతో షియోమి ఫాస్ట్‌ చార్జర్స్‌.. కేవలం 8 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌
Follow us

|

Updated on: Jun 01, 2021 | 11:57 AM

Xiaomi Hyper Charge: మొబైల్ రంగంలో సంచనాలకు తెరులేపుతున్న చైనాకు చెందిన షియోమీ.. ఇప్పుడు మరో సంచలనానికి రెడీ అవుతోంది. కొత్త టెక్నాలజీతో కూడిన ఫోన్లు, చార్జర్లు మార్కెట్లోకి విడుదల చేస్తోంది షియోమి. రోజురోజుకు మరింత టెక్నాలజీ జోడిస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. తాజాగా షియోమీ మరో రెండు కొత్త చార్జింగ్‌ టెక్నాలజీలను విడుదల చేసింది. వీటిలో 200వాట్‌ హైపర్‌చార్జ్‌ ఫాస్ట్‌ టెక్నాలజీ కాగా, మరొకటి 120 వాట్‌ వైర్‌లెస్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ టెక్నాలజీ. కంపెనీ వెల్లిస్తున్న వివరాల ప్రకారం.. 200వాట్ హైపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ సహయంతో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన మొబైల్‌ని కేవలం 8 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ చేయనున్నట్లు పేర్కొంది.

అలాగే, 120 వాట్ వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌తో అదే సామర్ధ్యం గల బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చంటోంది కంపెనీ. ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా షియోమీ షేర్‌ చేసింది. ఈ చార్జింగ్‌ సామర్థ్యానికి తగినట్లుగా మార్పులు చేసిన ఎంఐ 10 ప్రోను 10 శాతం చార్జింగ్ కావడానికి సమయం పడితే, 50 శాతం చార్జింగ్ కావడానికి 8 నిమిషాలు, 100 శాతం చార్జింగ్ కావడానికి 19 నిమిషాలు పట్టింది. షియోమీ గతంలో 120వాట్ వైర్డ్, 80 వాట్ వైర్‌లెస్ చార్జింగ్ టెక్నాలజీలను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. టెక్నాలజీ పరంగా ముందుకు సాగుతున్న చైనా.. సరికొత్త మొబైల్స్‌, చార్జర్లను తయారు చేస్తోంది.

ఇవీ కూడా చదవండి:

Buy Now Pay Later: కరోనా కాలంలో బై నౌ, పే లేటర్‌ స్కీమ్‌ల వైపు మొగ్గు చూపుతున్న కస్టమర్లు..!

New Rules : జూన్‌ 1వ తేదీ నుంచి పలు అంశాల్లో నిబంధనలు మారనున్నాయి.. తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..!