New Rules : జూన్‌ 1వ తేదీ నుంచి పలు అంశాల్లో నిబంధనలు మారనున్నాయి.. తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..!

New Rules From June 1: జూన్‌ నెల వచ్చేసింది. జూన్‌ 1వ తేదీ నుంచి పలు అంశాలు నిబంధనలు మారనున్నాయి. అయితే కొత్త నెల రావడంతో పాటు కొత్త రూల్స్ కూడా రానున్నాయి...

New Rules : జూన్‌ 1వ తేదీ నుంచి పలు అంశాల్లో నిబంధనలు మారనున్నాయి.. తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..!
Follow us
Subhash Goud

|

Updated on: May 31, 2021 | 8:58 AM

New Rules From June 1: జూన్‌ నెల వచ్చేసింది. జూన్‌ 1వ తేదీ నుంచి పలు అంశాలు నిబంధనలు మారనున్నాయి. అయితే కొత్త నెల రావడంతో పాటు కొత్త రూల్స్ కూడా రానున్నాయి. ఈ నిబంధనలు చాలా మందిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో చాలా మందిపై పలు రకాల ప్రభావం చూపే అవకాశం ఉంది. జూన్‌ నుంచి బ్యాంకింగ్‌, ఇతర అంశాల్లో మార్పులు జరుగుతుండటంతో ఆ విషయాలు తెలుసుకుని ఉండాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

కెనరా బ్యాంక్ కస్టమర్లకు సంబంధించి కూడా నిబంధనలు మారనున్నాయి. సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు జూన్ 30 తర్వాత పని చేయవు. అంటే జూలై 1 నుంచి కెనరా బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం కుదరదు. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు నిబంధనలు కూడా మారనున్నాయి. ఈ నిబంధనలు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. చెక్ పేమెంట్స్‌కు సంబంధించి నిబంధనలు మారబోతున్నాయి. రీకన్ఫర్మేషన్ అందించాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంక్ మీ చెక్‌ను క్లియర్ చేయదు.

ఇక గ్యాస్‌ సిలిండర్‌ వాడే వారు కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. కేంద్రం ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటుంది. ఈసారి కూడా జూన్‌ 1 నుంచి సిలిండర్ ధరలు మారే అవకాశం ఉంటుంది. లేదంటే స్థిరంగా కూడా కొనసాగే అవకాశం కూడా ఉంది.

ఆదాయపు పన్నుకు సంబంధించిన ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు మూసివేయబడుతుంది. అనంతరం జూన్ 7 న, పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in అందుబాటులోకి రానుంది.

అలాగే చిన్న పొదుపు పథకాలలో వడ్డీ రేటు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, కేవీపీ, సుకన్య సమృద్ధి యోజన మరియు అనేక ఇతర చిన్న పొదుపు పథకాలు జూన్‌లో వడ్డీ రేట్లను కేంద్రం మారుస్తుంది. ప్రతీ మూడు నెలలకోసారి ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేటును సవరిస్తుంది. ఇందులో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

Samsung Refrigerators: ఆదిరిపోయే ఆఫర్‌.. నెలకు రూ.890 కడితే చాలు ఫ్రిజ్‌ సొంతం చేసుకోవచ్చు..!

Gold Rate Today : పెరిగిన బంగారం ధరలు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో 10 గ్రాముల ధర ఎంతంటే..?