I-T Department ALERT: ఈ రోజు నుంచి ఆరు రోజుల పాటు ఈ-ఫైలింగ్ సేవలు క్లోజ్.. తిరిగి ఎప్పటి నుంచి అంటే…

ఆదాయ పన్ను చెల్లింపు దారులకు కేంద్రం మరోసారి సూచించింది. ఈ రోజు నుంచి జూన్ 6 మధ్య ఆరు రోజుల పాటు ఈ-ఫైలింగ్ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. ఆదాయపు పన్ను రిటర్నులను..

I-T Department ALERT: ఈ రోజు నుంచి ఆరు రోజుల పాటు ఈ-ఫైలింగ్ సేవలు క్లోజ్.. తిరిగి ఎప్పటి నుంచి అంటే...
New E Filing Portal Income
Follow us
Sanjay Kasula

|

Updated on: May 31, 2021 | 8:23 AM

ఆదాయ పన్ను చెల్లింపు దారులకు కేంద్రం మరోసారి సూచించింది. ఈ రోజు నుంచి జూన్ 6 మధ్య ఆరు రోజుల పాటు ఈ-ఫైలింగ్ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. ఆదాయపు పన్ను రిటర్నులను మరింత సులభతరం చేసేందుకు కొత్త వెబ్ సైట్ తీసుకొస్తున్నట్లుగా తెలిపింది. ఆదాయపు టాక్స్ రిటర్నులను మరింత సులభంగా.. మొబైల్‌ ఫోనులోనూ ఉపయోగించుకునేలా ఈ-ఫైలింగ్‌ 2.0 కొత్త పోర్టల్‌ అతి త్వరలో రానుంది. పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీ విభాగం కొత్త పోర్టల్ ఈ-ఫైలింగ్ 2.0ను జూన్ 7న ప్రారంభించనుంది. ఇప్పటికే ఉన్న పోర్టల్‌ incometaxindiaefiling.gov.in  స్థానంలో మరో కొత్త వెబ్‌సైట్ తీసుకొని రానున్నారు. ఆదాయపు పన్ను విభాగం వెబ్‌సైట్ ప్రారంభించటానికి ముందు.. జూన్ 1 నుంచి జూన్ 6 మధ్య ఆరు రోజుల పాటు ఈ-ఫైలింగ్ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది.

జూన్ 7 నాటికి కొత్త ఈ-ఫైలింగ్ వెబ్ పోర్టల్ incometax.gov.in  అందుబాటులోకి రానుంది. ఈ-ఫైలింగ్ 2.0 పోర్టల్ ముఖ్యమైన లక్షణాలను incometax విభాగం వివరించింది. మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నులను ఎలా చేయాలో మార్గనిర్దేశకం చేయడానికి చాలా ఈజీగా.. యూజర్ మాన్యువల్‌గా.. వీడియోలు కూడా ఉంటాయని వెల్లడించింది. అంతేకాకుండా, ఆన్-పోర్టల్ పన్ను చెల్లింపుల కోసం మల్టిపుల్ ఆప్షన్ లు ఉండనున్నాయి. ముందే మీరు ఇచ్చిన వివరాలు ఫిల్ చేసి ఉంటాయి. సురక్షితమెన లాగిన్, చాట్‌బాట్, హెల్ప్‌డెస్క్ సపోర్ట్ వంటివి పోర్టల్‌లో ఉంటాయి.  పాత వెబ్ సైట్‌లో  ఒకేసారి ఎక్కువ మంది వస్తే సైట్ మొత్తం నిలిచి పోయేది.. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న incometax.gov.in లో ఈ సమస్య ఉండదు.

ఇవి కూడా చదవండి : Hyderabad Metro Rail services : లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీస్‌ల వేళల్లో మార్పులు

సిద్దిపేట జిల్లాలో వికసించిన మానవత్వం.. ముగ్గురు కొడుకులున్నా ముందుకురానివైనం.. అంతిమ సంస్కారాలు చేసిన ముస్లిం యువకులు

TTD Announced: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. ఇవాళ్టి నుంచి అలిపిరి మెట్ల మార్గం మూసివేత