AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Announced: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. ఇవాళ్టి నుంచి అలిపిరి మెట్ల మార్గం మూసివేత

TTD Announced: నేటి నుంచి రెండు నెలల పాటు తిరుమల అలిపిరి మెట్ల మార్గం మూసివేస్తున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో...

TTD Announced: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. ఇవాళ్టి నుంచి అలిపిరి మెట్ల మార్గం మూసివేత
Alipiri Footpath Way
Sanjay Kasula
|

Updated on: May 31, 2021 | 7:44 AM

Share

నేటి నుంచి రెండు నెలల పాటు తిరుమల అలిపిరి మెట్ల మార్గం మూసివేస్తున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జూన్‌ 1 నుంచి జూలై 31వ తేదీ వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. అయితే, కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని కోరింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.

అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద ఫాస్టాగ్‌..

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద  మంగళవారం నుంచి ఫాస్టాగ్‌ అమల్లోకి రానుంది. ఇప్పటికే తిరుమల-తిరుపతి మధ్య టాక్సీవాలాలతో సమావేశమైన అధికారులు ఫాస్టాగ్‌ అమలుపై సమీక్ష నిర్వహించారు. దాంతో పాటు పెంచిన కొత్త టోల్‌ చార్జీలను కూడా అమలు చేయనున్నట్లుగా తెలిపారు. గతంలో రూ.2 చార్జీ వసూలు చేస్తున్న ద్విచక్రవాహనాలను ఇకపై ఉచితంగానే అనుమతిస్తారు. అయితే నాలుగు చక్రాల వాహనాలకు గతంలో రూ.15 చార్జీ ఉండగా ఇకపై రూ.50 వసూలు చేయనున్నారు. 13 సీటర్ల నుంచి రూ.100, లారీలు వంటి వాటి నుంచి రూ. 250 వసూలు చేయనున్నారు.

ఇవికూడాచదవండి : సిద్దిపేట జిల్లాలో వికసించిన మానవత్వం.. ముగ్గురు కొడుకులున్నా ముందుకురానివైనం.. అంతిమ సంస్కారాలు చేసిన ముస్లిం యువకులు

తిప్ప‌తీగ‌తో అత‌డి ల‌క్ తిరిగింది.. ఇప్పుడు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు

Hyderabad Metro Rail services : లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీస్‌ల వేళల్లో మార్పులు