తిప్ప‌తీగ‌తో అత‌డి ల‌క్ తిరిగింది.. ఇప్పుడు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు

తిప్పతీగ‌.. సిటీల‌లో ఉండేవాళ్ల‌కు దీని గురించి తెలియ‌క‌పోయినా.. ప‌ల్లె జనాల‌కు మాత్రం నిత్యం క‌నిపించేదే. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని..

తిప్ప‌తీగ‌తో అత‌డి ల‌క్ తిరిగింది.. ఇప్పుడు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు
Giloy Business
Follow us

|

Updated on: May 31, 2021 | 7:10 AM

తిప్పతీగ‌.. సిటీల‌లో ఉండేవాళ్ల‌కు దీని గురించి తెలియ‌క‌పోయినా.. ప‌ల్లె జనాల‌కు మాత్రం నిత్యం క‌నిపించేదే. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పెద్ద‌లు చెబుతారు. సైన్స్ ప‌రంగా కూడా ఆ విష‌యం ప్రూవ్ అయ్యింది. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో తిప్ప‌తీగ‌కు డిమాండ్ పెరిగింది. ఈ క్ర‌మంలో క‌రోనా కార‌ణంగా చాలామంది కొలువులు కోల్పోతుంటే.. తిప్ప‌తీగ‌తో రూ.కోట్ల కాంట్రాక్టుతో వ్యాపారంలో దూసుకుపోతున్నాడు ఓ యువ గిరిజన వ్యాపారి. వివ‌రాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఠాణేకు చెందిన సునీల్​ పవార్​ అనే యువకుడు తిప్పతీగ సరఫరా కోసం పేరొందిన సంస్థలతో రూ.1.5కోట్ల అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. అంతేకాదు.. తన వ్యాపారం ద్వారా వందల మంది గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నాడు.

షాహ్​పుర్​ తాలుకాలోని ఖరిద్​కు చెందిన సునీల్​కు.. స్థానిక అడవుల్లో లభించే ఔషధ గుణాలున్న మొక్కలపై మంచి పెద్ద‌ల ద్వారా అవ‌గాహ‌న ఏర్ప‌డింది. ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెంచడంలో తిప్పతీగ బాగా ఉప‌యోగ‌ప‌డుతుందని అత‌డు తెలుసుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం దానిని సేకరించి.. కంపెనీలకు అందించే వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు​. అందులో భాగంగా కట్కరీ తెగకు ఉపాధి కల్పిస్తూ ప్రధానమంత్రి వన్​ధన్​ పథకం సాయంతో వన్​ధన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు​. ఆ సమయంలో ఏడాదికి రూ.3 నుంచి రూ.5 లక్షలు సంపాదించేవాడు. కరోనా మహమ్మారి కారణంగా తిప్పతీగకు డిమాండ్ విపరీతంగా​ పెరిగింది. దీంతో డాబర్, బైద్యనాథ్, హిమాలయ వంటి సంస్థలకు 350 టన్నుల తిప్పతీగ సరఫరా చేసేందుకు అతడు ఏకంగా రూ.1.57కోట్ల కాంట్రాక్టును దక్కించుకున్నాడు. ప్రస్తుతం షాహ్​పుర్​లోనే సునీల్​కు 6 వన్​ధన్​ కేంద్రాలున్నాయి.  ఆయుర్వేదంలో తిప్పతీగను విరివిగా వాడతారు. హెపటైటిస్, ఆస్తమా, జ్వరం, డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలను నయం చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది.

Also Read: తెలంగాణ‌లో అంతర్రాష్ట్ర సర్వీసుల‌కు అనుమ‌తి లేదు.. స‌డ‌లింపుల వివ‌రాలు ఇలా ఉన్నాయి

 కరోనా నుంచి కోలుకున్న‌ తర్వాత అటాక్ చేస్తోన్న ప్ర‌ధాన జ‌బ్బులు ఇవే – జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!