- Telugu News Photo Gallery Business photos Ajaj finserv emi store offers samsung refrigerators on no cost emis
Samsung Refrigerators: ఆదిరిపోయే ఆఫర్.. నెలకు రూ.890 కడితే చాలు ఫ్రిజ్ సొంతం చేసుకోవచ్చు..!
ఫ్రిజ్ కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఒకేసారి డబ్బులు పెట్టి కొనుగోలు చేయలేనివారు ఈఎంఐలో తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకు మీకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ..
Updated on: May 31, 2021 | 9:07 AM

ఫ్రిజ్ కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఒకేసారి డబ్బులు పెట్టి కొనుగోలు చేయలేనివారు ఈఎంఐలో తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకు మీకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ స్టోర్ కస్టమర్లకు మంచి డీల్ అందిస్తోంది.

శాంసంగ్ రిఫ్రిజిరేటర్లపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందిస్తోంది. మీరు నెలకు రూ.890 చెల్లించి శాంసంగ్ ఫ్రిజ్‌ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ఫ్రిజ్‌లలో డిజిటల్ ఇన్వర్టర్స్, ఆల్‌రౌండ్ క్లీనింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. కస్టమర్లకు సింగిల్ డోర్, డబుల్ డోర్ ఫ్రిజ్‌లు అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్ 212 లీటర్ల 5 స్టార్ డబుల్ డోర్ ఫ్రిజ్ కొనాలనుకుంటే ఈఎంఐ రూ.890గా ఉంది. అలాగే 198 లీటర్ల 5 స్టార్ సింగిల్ ఫ్రిజ్ కొంటే ఈఎంఐ రూ.1000 కట్టాల్సి ఉంటుంది. 198 లీటర్ల 3 స్టార్ సింగిల్ డోర్ ఫ్రిజ్ అయితే రూ.1025 ఈఎంఐ కట్టాలి. 386 లీటర్ల 2 స్టార్ డబుల్ డోర్ ఫ్రిజ్ అయితే రూ.2333 ఈఎంఐ పడుతుంది. ఫ్రిజ్ కొనాలనుకునే వారు బజాజ్ ఈఎంఐ స్టోర్‌లోకి లాగిన్ అయి కొనుగోలు చేయవచ్చు. 3 నుంచి 24 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు.





























