- Telugu News Photo Gallery Business photos Maruti alto has variants know the price every model before buying
Maruti Alto: కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? మారుతి ఆల్టోలో తక్కువ ధరల్లో అందుబాటులో..!
దేశంలో అత్యంత సేల్స్ సాధించిన మారుతి ఆల్టో కారు ఎంతో గుర్తింపు పొందింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా ఉంది.ముఖ్యంగా 2006 తరువాత, ఇది..
Updated on: May 29, 2021 | 3:06 PM

దేశంలో అత్యంత సేల్స్ సాధించిన మారుతి ఆల్టో కారు ఎంతో గుర్తింపు పొందింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా ఉంది.ముఖ్యంగా 2006 తరువాత, ఇది అత్యధికంగా అమ్ముడైన కారుగా గుర్తింపు పొంది. దీనికి ప్రత్యేక కారణం Alto ప్రారంభ ధర రూ .3 లక్షల కన్నా తక్కువగా ఉండటమే. భారతదేశంలో టాప్ 5 చౌకైన కార్లలో Alto ఒకటి. ఆల్టో లో మొత్తం 8 వేరియంట్లు ఉన్నాయి, వీటిలో సిఎన్జీ మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ కారు అన్ని వేరియంట్ల ధరలను తెలుసుకుందాం.

Alto లోని బేసిక్ వేరియంట్ ఇదే. దీని ధర 2.95 లక్షలు. ఈ మోడల్‌లో 796 సిసి ఇంజన్ ఉంది. ఈ Alto మోడల్ 22.05 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. Alto STD వేరియంట్ ఒక పెట్రోల్ కారు. ఇది మాన్యువల్ 5 గేర్స్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంది. ఇలాగే ఇందులోనే మరో వేరియంట్ ఉంది. దీని ధర రూ .2,99,900 లక్షలు. ఈ మోడల్‌లో 796 సిసి ఇంజన్ కూడా ఉంది. ఈ మోడల్ 22.05 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారు బరువు 732 కిలోలు.

ఇంకో మోడల్ ధర 3,52,900 రూపాయలు. ఇది పెట్రోల్ వేరియంట్. ఇది 796 సిసి ఇంజిన్‌తో 22.05 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. Alto ఎల్‌ఎక్స్‌ఐ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తుంది. గ్రానైట్ గ్రే, సెరులియన్ బ్లూ, మోజిటో గ్రీన్, అప్‌టౌన్ రెడ్, సిల్కీ సిల్వర్ మరియు సాలిడ్ వైట్‌తో సహా 6 కలర్స్‌లో లభ్యమవుతుంది.

అలాగే ఆల్టోలో మరో వేరియంట్ ధర 3,57,200 రూపాయలు. ఈ వేరియంట్ యొక్క ఇంజిన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్‌పి మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 69 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. MarutiSuzuki ఎల్ఎక్స్ఐ (ఓ) మాన్యువల్ ట్రాన్స్మిషన్లో కూడా లభిస్తుంది.





























