Tvs Sport bike: అధిక మైలేజీ ఇచ్చే బైక్ కావాలా..? కొత్త ఫీచర్స్‌తో విడుదలైన టీవీఎస్ స్పోర్ట్ బైక్
దేశంలోని టూ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ ఇటీవల కొత్త కమ్యూటర్ బైక్ టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)ను కొత్త అప్‌డేట్ చేసిన బిఎస్ 6 ఇంజిన్‌తో మార్కెట్లోకి..
Updated on: May 31, 2021 | 2:29 PM

దేశంలోని టూ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ ఇటీవల కొత్త కమ్యూటర్ బైక్ టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)ను కొత్త అప్‌డేట్ చేసిన బిఎస్ 6 ఇంజిన్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ద్విచక్ర వాహనం మరోసారి రోడ్ మైలేజీలో ఉత్తమమైనదిగా రికార్డు సృష్టించింది. కొత్త టీవీఎస్ స్పోర్ట్ ఒక లీటరు ఇంధనంలో 110.12 కి.మీ ప్రయాణించినట్లు ఈ బైక్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించింది.

గత ఏడాది ఈ బైక్ యొక్క బిఎస్ 4 మోడల్ 76.4 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగా, ఈ రికార్డ్ కోసం ఈ బైక్ 1021.90 కిలోమీటర్లు ప్రయాణించి మొత్తం 54 ల్యాప్‌లను పూర్తి చేసింది. ఈ సమయంలో బైక్ 9.28 లీటర్ల చమురును వినియోగించింది.

టీవీఎస్ స్పోర్ట్ లో 109.7 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్‌తో 4 స్ట్రోక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఎయిర్ కూల్డ్ స్పార్క్ ఇంజిన్‌ను కంపెనీ ఉపయోగించింది. ఇది 8.29 పిఎస్ శక్తిని మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా, ఈ బైక్‌లో ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ టెక్ టెక్నాలజీని కూడా కంపెనీ వినియోగించింది. ఈ వాహనం మునుపటి మోడల్ కంటే 15 శాతం ఎక్కువ మైలేజీని అందించేలా తయారు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ఇందులో4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.

ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఆయిల్ డంప్డ్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో 5-దశల హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ ఉన్నాయి. 10 లీటర్ సామర్థ్యం గల ఇంధన ట్యాంకును అమర్చారు ఈ బైక్‌కుకు. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కి.మీ మరియు దీనికి 175 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఈ బైక్ మొత్తం బరువు 110 కిలోలు. ఇందులో ఇంకా ఎన్నో రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ప్రారంభ ధర 53,700 రూపాయలుగా ఉంది.





























