AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakeela Help: ఆకలి తీర్చే దేవతగా మారిన షకీలా..! కుక్ విత్ క్లౌన్ షో నుంచి సేవారంగంలోకి…

Shakeela Helping Hands: నటనతో యువత గుండెళ్లో తుఫాన్ సృష్టించే షకీలా నిజ జీవితంలో మాత్రం ఆకలితో ఉన్న అన్నార్థులకు నేనున్నాంటూ సాయం చేస్తున్నారు. పేదలకు అన్నం పెట్టి దాతృత్వం చాటుకుంటున్నారు.

Shakeela Help: ఆకలి తీర్చే దేవతగా మారిన షకీలా..! కుక్ విత్ క్లౌన్ షో నుంచి సేవారంగంలోకి...
Shakeela Helping Hands
Sanjay Kasula
|

Updated on: Jun 01, 2021 | 9:30 AM

Share

మంచికి మానవత్వానికి మరో పేరులా నిలుస్తున్నారు సినిమా నటులు. వలస కార్మికులు ఇళ్లు చేరడానికి సహాయపడుతున్నాడు. ఆకలి బాధ తీరుస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్‌ చేయిస్తున్నాడు. ఊపిరి పోస్తున్నాడు. మనిషిని బతికించడానికి చేతనైంత చేస్తూ దేవుడిగా మారాడు రీల్ విలన్.. రియల్ టైమ్ హీరో సోనూ సూద్.. అదే బాటలో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు నటి షకీలా. నటనతో యువత గుండెళ్లో తుఫాన్ సృష్టించే షకీలా నిజ జీవితంలో మాత్రం ఆకలితో ఉన్న అన్నార్థులకు నేనున్నాంటూ సాయం చేస్తున్నారు. పేదలకు అన్నం పెట్టి దాతృత్వం చాటుకుంటున్నారు.

ఇదిలావుండగా, కుక్ విత్ క్లౌన్ షో నుంచి  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న నటి షకీలా ప్రస్తుతం సామాజిక సేవలో కూడా పాల్గొంటున్నారు. కర్ఫ్యూ కారణంగా రోడ్డు పక్కన ఆకలితో ఉన్న పేద సాధారణ ప్రజలకు ఆయన ఆహారం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను షకీలా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అందులో ఆమె పేర్కొంటూ.. రెండు చేతుల్లో ఒక చేతిని మీకోసం, మరో చేతిని ఇతరులకు సాయపడేందుకు ఉపయోగించండి.. పేదలకు చేతనైన సాయం చేయండి.. అంటూ పిలుపునిచ్చారు.

తన కుక్ విత్ క్లౌన్ షో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ఉంది. షకీల నిర్వహించే ఈ షోకు లక్షల్లో వీక్షకులు స్పందిస్తుంటారు. అయితే ఇప్పుడు సామాజిక సేవలో పాల్గొన్న షకీలను వారు మరింత ప్రోత్సహిస్తున్నారు. మీరు చేయండి.. మీతో మేమున్నాం అంటూ రీ పోస్ట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Good News: ఈ రోజు నుంచి మార్కెట్లోకి రానున్న డీఆర్‌డీవో మందు.. అందుబాటులోకి 6-8 లక్షల 2డీజీ మెడిసిన్ ప్యాకెట్లు

Good News: జూన్‌లో జోరందుకోనున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన

New Rules From Today: ఈ రోజు నుంచి చాలా మారిపోతున్నాయి..! గమనించారా..! అయితే మీ ఇష్టం..!