5G Phones Coming This June: ఈ నెలలో మార్కెట్లో సందడి చేయనున్న 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే.. వాటిపై ఓ లుక్కేయండి..
5G Phones Coming This June: భారత్‌లో 5జీ నెట్‌వర్క్ సేవలు ప్రారంభమవుతోన్న వేళ. మార్కెట్లో 5జీ మొబైల్స్ లాంచ్ చేయడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త ఫోన్‌లు లాంచ్ చేస్తున్నాయి....
5G Phones Coming This June: భారత్‌లో 5జీ నెట్‌వర్క్ సేవలు ప్రారంభమవుతోన్న వేళ. మార్కెట్లో 5జీ మొబైల్స్ లాంచ్ చేయడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త ఫోన్‌లు లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా జూన్ నెలలో టెక్ మార్కెట్లోకి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్లు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ నెలలో రాబోతున్న ఫోన్‌లు ఏంటీ.? వాటి ఫీచర్లు ఏంటన్న దానిపై ఓ లుక్కేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎ 22 5జీ:
ప్రముఖ మొబైల్ కంపెనీ సామ్‌సంగ్ ఈ నెలలో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశాలున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎ 22 5జీ పేరుతో తీసుకున్న రానున్న ఈ ఫోన్ రూ. 16000 ఉండనుంది (అంచనా). ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 6.4 అంగుళాల హెచ్‌డీ + డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ ప్రాసెసర్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.
షియోమి ఎమ్ ఐ 11 ప్రో 5 జీ:
కర్వ్ ఎడ్జ్ డిస్‌ప్లేతో కూడిన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే నెలలో రానుంది. హైఎండ్ ఫీచర్లతో రానున్న ఈ ఫోన్ ధర రూ. 60 వేల వరకు ఉండే అవకాశాలున్నాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 888 సోసి ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ మొబైల్ సొంతం.
రెడ్‌మి కె 40 5 జీ:
తక్కువ ధరలో 5జీ వెర్షన్ విభాగంలో రెడ్‌మి కె 40 5జీ ప్రవేశ పెట్టనుంది. ఈ మొబైల్ ధర రూ. 25000 వరకు ఉండొచ్చని ఓ అంచనా. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 120Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 870 SoC ప్రాసెసర్, 12GB వరకు ర్యామ్, 48 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఫీచర్‌ను అందిస్తోంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ:
ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 10న విడుదల కానుంది. జూన్ 11 నుంచి వినియోగదారుల కోసం ప్రీ-ఆర్డర్ అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 90 హెడ్జ్ డిస్‌ప్లే, స్నాప్ గ్రాగన్ 750జి ప్రాపెసర్, 64 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమరా దీని ప్రత్యేకతలు.
Also Read: Rahul Gandhi: దేశంలో బ్లాక్ ఫంగస్ విస్తరణపై కేంద్రాన్ని మూడు ప్రశ్నలు వేసిన రాహుల్ గాంధీ
నోయిడా వ్యక్తికి వింత అనుభవం… కొవిడ్ టీకా వేసుకోకుండానే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్..ఎలా సాధ్యం?