PMVVY: గుడ్న్యూస్.. వారికి సంవత్సరానికి రూ. 1.11 లక్షల పెన్షన్.. ఎలాగో తెలుసుకోండి..
కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అందులో సీనియర్ సిటిజన్స్
కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అందులో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రధాన మంత్రి వయ వందన యోజన్ యోజన (PMVVY) ప్రవేశపెట్టింది. ఇది ఒక సామాజిక భద్రతా పథకం. ఇది కొనుగోలు ధర/ సబ్స్క్రిప్షన్ మొత్తంపై హామీ ఇవ్వబడిన రిటర్న్ ఆధారంగా సీనియర్ సిటిజన్స్ కోసం కనీస పెన్షన్ ఇవ్వబడుతుంది. జూన్ 2020లో క్యాబినెట్ ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకాన్ని 2023 మార్చి 31 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది.
లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కి ప్రభుత్వ గ్యారంటీ ఆధారంగా సబ్ స్క్రిప్షన్ అయిన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద పెట్టుబడి గరిష్ట పరిమితి రూ.15 లక్షలు, నెలవారీ పెన్షన్ రూ. 10,000. ఈ పథకం 10 సంవత్సరాలపాటు సంవత్సరానికి 8 శాతంతో కూడిన రాబడిని అందిస్తుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ఫ్రీక్వెన్సీ ప్రకారం 10 సంవత్సరాల పాలసీ వ్యవధిలో ప్రతి వ్యవధి ముగింపులో పెన్షన్ చెల్లిస్తారు. ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 12,000 పెన్షన్ కోసం కనీస పెట్టుబడి రూ. 1,56,658 ఉంటుంది. అలాగే నెలకు రూ. 1000 కనీస పెన్షన్ మొత్తం పొందడానికి రూ.1,62,162కి సవరించబడింది.
అర్హతలు.. 1. కనీస ప్రవేశ వయస్సు.. 60 సంవత్సరాలు. 2. పాలసీ కాలవ్యవధి.. 10 సంవత్సరాలు. 3. కనీస పెన్షన్.. నెలకు రూ. 1000 4. ఆరు నెలలకు రూ. 3000. 5. సంవత్సరానికి రూ. 6000 6. గరిష్ట పెన్షన్.. నెలకు రూ.9,250 7. మూడు నెలలకు రూ. 27,750. 8. ఆరు నెలలకు రూ.55,500. 9. సంవత్సరానికి రూ.1,11,000.
Also Read: BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..
Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్
Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..
Rashmi Gautam: హాట్ టాపిక్ గా యాంకర్ రష్మీ పెళ్లి టాపిక్.. సీక్రెట్ గా చేసేసుకుందంటూ గుసగుసలు