PPF vs SSY: పీపీఎఫ్ వర్సెస్ సుకన్య సమృద్ధి యోజన.. రాబడి పరంగా రెండిటిలో ఏది బెస్ట్‌..!

PPF vs SSY: పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) రెండు పథకాలు

PPF vs SSY: పీపీఎఫ్ వర్సెస్ సుకన్య సమృద్ధి యోజన.. రాబడి పరంగా రెండిటిలో ఏది బెస్ట్‌..!
Money
Follow us

|

Updated on: Mar 18, 2022 | 5:54 AM

PPF vs SSY: పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) రెండు పథకాలు పెట్టుబడి పరంగా చాలా మంచివి. ఇందులో డిపాజిట్‌ చేసిన డబ్బు సురక్షితంగా ఉంటుంది. మంచి రాబడి కూడా అందుబాటులో ఉంటుంది. కానీ చాలా మంది ఏ పథకంలో పెట్టుబడి పెట్టాలి.. ఎంత రాబడి వస్తుంది.. అనే సందేహంతో ఉంటారు. సుకన్య సమృద్ధి యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇందులో కూతురి పేరు మీద మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. కానీ పీపీఎఫ్‌లో ఎవరి పేరుతోనైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. అదే సమయంలో సుకన్య సమృద్ధి యోజన (SSY)పై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడం బాగుంటుంది. కానీ ఈ రెండు పథకాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. PPFలో తక్కువ వడ్డీ వచ్చినప్పటికీ దీర్ఘకాలికంగా మంచి రాబడి వస్తుందిని నిపుణులు చెబుతున్నారు.

PPFలో 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.15 సంవత్సరాల తర్వాత మీరు దానిని 5 సంవత్సరాలకు పొడిగించవచ్చు. మీరు రెండు పథకాలలో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పెట్టుబడిపై మినహాయింపు పొందుతారు. మీరు సంవత్సరానికి కనిష్టంగా రూ. 500 గరిష్టంగా రూ. 1.50 లక్షలను PPF ఖాతాలో జమ చేయవచ్చు.

సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడానికి కనీస మొత్తం రూ.250. ఈ పథకంలో ఏడాదికి కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. కుమార్తె చదువు/పెళ్లి నిమిత్తం ఈ పథకం ప్రారంభించారు. ఈ కారణంగా PPF కంటే ఎక్కువ రేటును ఇందులో ఉంచారు. కుమార్తెకు 15 ఏళ్లు వచ్చే వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. 16 నుంచి 21 సంవత్సరాల మధ్య ఎటువంటి డిపాజిట్ అనుమతించరు. కానీ ఖాతాదారుడు డిపాజిట్ మొత్తంపై వడ్డీని పొందుతాడు.

మీరు ప్రతి సంవత్సరం PPF ఖాతాలో రూ.1.50 లక్షలు డిపాజిట్ చేస్తే మీరు ప్రస్తుత వడ్డీ రేటు (7.1 శాతం) ప్రకారం 15 సంవత్సరాల మెచ్యూరిటీపై రూ. 40.68 లక్షలు పొందుతారు. అలాగే సుకన్య సమృద్ధి యోజనలో 21 ఏళ్ల మెచ్యూరిటీపై ప్రతి సంవత్సరం రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేస్తే మీకు 63.65 వేల రూపాయలు లభిస్తాయి. పిల్లలకి 10 సంవత్సరాల వయస్సులోపు మాత్రమే ఈ ఖాతా ఓపెన్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.

Hyderabad: జూబ్లీహిల్స్‌ రోడ్డులో కారు బీభత్సం.. రెండున్నరేళ్ల బాబు అక్కడికక్కడే మృతి

Holi 2022: విచిత్ర సంప్రదాయం.. హోలీ రోజు కొత్త అల్లుడిని గుర్రంపై ఊరేగిస్తారు..!

వాహనాలపై ఆ స్టిక్కర్లు అతికించారా.. అక్కడి పోలీసుల కొత్త రూల్‌ తెలిస్తే షాకవుతారు..!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..