LPG Gas Connection: ఉచిత సిలిండర్లు అందిస్తున్న కేంద్రం.. కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోండి..!

LPG Gas Connection: ప్రస్తుతం వంట గ్యాస్‌ సిలిండర్లు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో ప్రతి ఒక్కరి ఇంట్లో కట్టెలపొయ్యి లేకుండా గ్యాస్‌..

LPG Gas Connection: ఉచిత సిలిండర్లు అందిస్తున్న కేంద్రం.. కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోండి..!
Follow us

|

Updated on: Oct 04, 2021 | 2:13 PM

LPG Gas Connection: ప్రస్తుతం వంట గ్యాస్‌ సిలిండర్లు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో ప్రతి ఒక్కరి ఇంట్లో కట్టెలపొయ్యి లేకుండా గ్యాస్‌ సిలిండర్ ఉండేలా చర్యలు చేపడుతోంది. మహిళా సంఘాలకే కేంద్రం ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ను అందిస్తోంది. బీపీఎల్‌ కార్డు ఉంటే ఉచితంగానే గ్యాస్‌ కనెక్షన్‌ పొందవచ్చు. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ గ్రామీణ మరియు అణగారిన గృహాలకు ఎల్‌పీజీ అందుబాటులో ఉంచే లక్ష్యంతో PMUY ని ఒక ప్రధాన పథకంగా ప్రవేశపెట్టింది. ప్రధాన్‌ మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగానే మరో కోటి కొత్త గ్యాస్‌ కనెక్షన్లను అందిస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీమ్ కింద 2021 జనవరి చివరి నాటికి 8.3 కోట్లకుపైగా ఎల్‌పీజీ కనెక్షన్లు అందించింది. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంగా లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి మూడు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. అయితే ఉజ్వల స్కీమ్‌లో చేరిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో భాగంగా ఉచితంగా సిలిండర్లు అందించింది.

కొత్తగా గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ కోసం..

అయితే కొత్తగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలని అనుకుంటే.. రూ.3,200 ఖర్చు అవుతుంది. అయితే మీరు ఉజ్వల స్కీమ్ కింద ఎల్‌పీజీ కనెక్షన్ పొందితే రూ.1600 సబ్సిడీ వస్తుంది. కేంద్రం ఈ డబ్బులు చెల్లిస్తుంది. ఇక మిగిలిన రూ.1600 ఆయిల్ కంపెనీలు అందిస్తాయి. అయితే కస్టమర్లు ఈఎంఐ రూపంలో ఈ 1600 తర్వాత ఆయిల్ కంపెనీలకు చెల్లించాలి. ప్రస్తుతం దేశంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.884.50 ఉంది. సగటున ఈ స్కీమ్ కింద ఉన్న లబ్దిదారుడు సగటు ఏడాదికి మూడు సిలిండర్లను ఉపయోగించుకుంటారు. ఈ పీఎంయూవై పథకాన్ని 2016, మే 1న ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ కనెక్షన్‌ తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఎలాంటి ఖర్చు లేకుండా అందిస్తోంది కేంద్రం. అధికారిక డేటా ప్రకారం.. పీఎంయువై మొదటి దశ కింద ఇప్పటి వరకు 8. మిలియన్లకుపైగా గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేసింది కేంద్రం. ఇప్పడు రెండో దశ కొనసాగుతోంది.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) స్కీమ్ మొదటి శలో ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి రూ.1,600 ఆర్థిక సహకారం అందించింది కేంద్ర ప్రభుత్వం. రెండో దశ ద్వారా ఉచితంగా గ్యాస్ స్టవ్‌తో పాటు, ఉచితంగా గ్యాస్ సిలిండర్ కూడా లభిస్తుంది. పీఎం ఉజ్వల యోజన స్కీమ్‌కు దరఖాస్తు చేయడం చాలా సులువు. వలస కూలీలు రేషన్ కార్డులను, అడ్రస్ ప్రూఫ్‌ను సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ డిక్లరేషన్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డిక్లరేషన్ ఇస్తే చాలు. మహిళలు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేయాలి. 18 ఏళ్లు దాటిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న మహిళలు మాత్రమే అర్హులు. బీపీఎల్ కార్డు లేదా రేషన్ కార్డ్ ఉండాలి. వారి కుటుంబానికి చెందిన ఎవరి పేరు మీదా ఎల్‌పీజీ కనెక్షన్ ఉండకూడదు.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్‌కు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలో ఉన్న ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే https://pmujjwalayojana.com వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో సమర్పించాల్సి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

io Cashback Offer: మీరు జియో సిమ్‌ వాడుతున్నారా..? ఈ రీచార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌..!

High Speed Internet: రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌లకు భారీ షాక్‌.. డిసెంబర్‌ నుంచి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌.. ఏ కంపెనీ అంటే..!