Spicejet: వామ్మో.. అక్కడ విమానం పార్కింగ్ ఫీజు రూ.5.5 కోట్లు.. ఎక్కడో తెలుసా..

సినిమా థియేటర్‎కు బండి తీసుకెళ్తే ఎక్కడ పార్కింగ్ ఫీజు కట్టాల్సి వస్తుందోనని నడిచి వెళ్తాం. థియేటర్ దూరంగా ఉంటే బండిపై వెళ్లినా ఆ వాహనాన్ని తెలిసిన వారి ఇంటి వద్ద పార్కింగ్ చేస్తాం...

Spicejet: వామ్మో.. అక్కడ విమానం పార్కింగ్ ఫీజు రూ.5.5 కోట్లు.. ఎక్కడో తెలుసా..
Flight
Follow us

|

Updated on: Oct 04, 2021 | 4:52 PM

సినిమా థియేటర్‎కు బండి తీసుకెళ్తే ఎక్కడ పార్కింగ్ ఫీజు కట్టాల్సి వస్తుందోనని నడిచి వెళ్తాం. థియేటర్ దూరంగా ఉంటే బండిపై వెళ్లినా ఆ వాహనాన్ని తెలిసిన వారి ఇంటి వద్ద పార్కింగ్ చేస్తాం. తప్పక పార్కింగ్ చెల్లించాల్సి వస్తే రూ.10, రూ. 20 ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇవ్వలేం. కానీ ఓ విమానం పార్కింగ్ ఫీజు ఏకంగా రూ.5.5 కోట్లుగా ఉంది. ఇది ఎక్కడో ఫారన్ కంట్రీలో కాదు మన ఇండియాలోనే..

కోల్‌కతా విమానాశ్రయంలో స్పైస్‌జెట్ బోయింగ్ B-737 MAX 8 విమానం పార్కింగ్ చేసినందుకు రూ .5.5 కోట్ల పార్కింగ్ ఫీజును చెల్లించింది ఆ సంస్థ. VT-MXA రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన విమానం కోల్‌కతా విమానాశ్రయంలో 30 నెలలుగా పార్కింగ్ చేసి ఉంది. స్పైస్ జెట్ B-737 మాక్స్ 8 విమానం మార్చి 13, 2019 నుండి కోల్‌కతా విమానాశ్రయంలో ఉంది. ఇప్పుడు రెగ్యులేటరీ అథారిటీ విమానం కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించింది. అక్టోబర్ 5 నుండి ఈ విమానాన్ని నడపాలని స్పైస్ జెట్ యోచిస్తోంది.

విమానం బే నుండి బయటకు వెళ్లిన తర్వాత, ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ ఛార్జీ బిల్లును ఎయిర్‌లైన్స్‌కు ఇస్తుందని ఎయిర్‌పోర్ట్ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు. స్పైస్ జెట్ 2018 నవంబరులో ఈ విమానాన్ని కొనుగోలు చేసి కోల్‌కతాలోని విమానాశ్రయంలోకి తీసుకొచ్చింది. నాలుగు నెలల తరువాత స్పైస్ జెట్ 13 బోయింగ్ 737 MAX ఎయిర్‌క్రాఫ్ట్‌లపై డీజీసీఏ నిషేధం విధించింది. ఈ తరహా విమానాలు ప్రమాదానికి గురవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండోనేషియా, ఇథియోపియాలో ఈ మోడల్ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి.

అక్టోబర్ 5 నుంచి ఈ విమానాన్ని నడపడానికి స్పైస్ జెట్ నిర్ణయించింది. ఇందుకు గుర్గావ్‌లోని స్పైస్‌జెట్ ట్రైనింగ్ అకాడమీ, నోయిడాలోని బోయింగ్ సిమ్యులేటర్ సదుపాయంలో పైలెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. ఈ విమానం నపడానికి అర్హత పొందిన 350 మంది పైలట్లు ఎయిర్‌లైన్స్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ విమానాన్ని శుభ్రం చేయిస్తున్నట్లు విమానాశ్రయ అధికారి ఒకరు చెప్పారు.

Read Also.. LPG Gas Connection: ఉచిత సిలిండర్లు అందిస్తున్న కేంద్రం.. కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోండి..!