Jio Cashback Offer: మీరు జియో సిమ్ వాడుతున్నారా..? ఈ రీచార్జ్‌లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్..!
Jio Cashback Offer: టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. నెలనెల కస్టమర్లను భారీగా వచ్చి చేరుతున్నారు. అయితే మీరు జియో సిమ్ వాడుతున్నట్లయితే..
Jio Cashback Offer: టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. నెలనెల కస్టమర్లను భారీగా వచ్చి చేరుతున్నారు. అయితే మీరు జియో సిమ్ వాడుతున్నట్లయితే మీకో గుడ్‌న్యూస్. జియో సిమ్ కార్డ్ రీచార్జ్ చేసుకుంటే క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో లేదు. కొందరికే మాత్రమే వర్తించనుంది. రిలయన్స్ రిటైల్ తాజాగా జియో ప్రిపెయిడ్ కస్టమర్లకు మూడు రిచార్జ్ ప్లాన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. 20 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అక్టోబర్ 2 నుంచి క్యాష్‌బ్యాక్ ఆఫర్ అమలులోకి వచ్చింది. రిలయన్స్ రిటైల్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్, ఏజియో వంటి వాటిల్లో క్యాష్‌బ్యాక్ రిడీమ్ చేసుకోవచ్చు.
మూడు ప్లాన్లపై ఆఫర్..
జియో వెబ్‌సైట్ లేదా మైజియో యాప్ ద్వారా రీచార్జ్ చేసుకుంటేనే ఆఫర్ వర్తిస్తుంది. రూ.249, రూ.555, రూ.599 ప్లాన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా రీచార్జ్ చేసుకుంటే ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉండవు.
క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలంటే..
యూజర్లు జియో.కామ్‌లోకి వెళ్లిన తర్వాత ప్రిపెయిడ్‌లోని వెళ్లాలి. అక్కడ పాపులర్ ప్లాన్స్ ఎంచుకోవాలి. తర్వాత 20 శాతం క్యాష్‌బ్యాక్ కింద నచ్చిన ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. ఇక రీచార్జ్ పూర్తయిన తర్వాత క్యాష్‌బ్యాక్ జియో అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.