AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: వినియోగదారులకు ప్రధాని మోడీ శుభవార్త.. సహకార డెయిరీ, పాల ఉత్పత్తుల కోసం ప్రత్యేక పోర్టల్..

PM Modi: సహకార డెయిరీ, పాల ఉత్పత్తుల కోసం ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభించారు. దీనివల్ల వినియోగదారులకు చాలా లాభాలున్నాయి.

PM Modi: వినియోగదారులకు ప్రధాని మోడీ శుభవార్త.. సహకార డెయిరీ, పాల ఉత్పత్తుల కోసం ప్రత్యేక పోర్టల్..
Milk
uppula Raju
|

Updated on: Dec 23, 2021 | 11:51 PM

Share

PM Modi: సహకార డెయిరీ, పాల ఉత్పత్తుల కోసం ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభించారు. దీనివల్ల వినియోగదారులకు చాలా లాభాలున్నాయి. వినియోగదారులకు పరిశుభ్రమైన పాలు, సురక్షితమైన పాల ఉత్పత్తులను అందించడానికి ఒక నిర్ధారిత సంస్థ అవసరం. డెయిరీ రంగం దీర్ఘకాలిక కార్యకలాపాలకు ఇది చాలా ముఖ్యం. NDDB, BIS ఇప్పుడు పాల ఉత్పత్తులను ధృవీకరిస్తాయి. వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

సహకార సంఘాల డెయిరీ ప్లాంట్లకు ఎన్‌డిడిబి ద్వారా ‘క్వాలిటీ మార్క్’ అందిస్తారు. ఇది సహకార డెయిరీలకు బ్రాండ్ గుర్తింపును ఇస్తుంది. వినియోగదారులలో నమ్మకాన్ని పెంపొందించడానికి ఇది సహాయపడుతుంది. అదేవిధంగా మరోవైపు BIS పాల ఉత్పత్తుల ధృవీకరణ కోసం పనిచేస్తుంది. ఇది పాల ఉత్పత్తులకి ఆహార భద్రతని నిర్ధారిస్తుంది. లైసెన్స్‌దారులు తమ ఉత్పత్తులపై ‘ISI మార్క్’ని ఉపయోగించడానికి అనుమతిస్తుంది.

పాలు, పాల ఉత్పత్తుల నాణ్యతపై వినియోగదారులకు అవగాహన కొరవడింది. ఇది గుర్తించిన భారత ప్రభుత్వ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ అనేక సంప్రదింపుల తర్వాత NDDB, BIS లను ప్రవేశపెట్టింది. ఇవి పాలు, పాల ఉత్పత్తుల పాడైపోయే స్వభావం, తక్కువ నిల్వ, యుటిలిటీ కాలాన్ని నిర్దారిస్తాయి. BIS-ISI, NDDBలు నాణ్యతకు గుర్తులు. కామధేను ఆవును కలిగి ఉన్న ఇంటిగ్రేటెడ్ లోగోతో ఇది ‘ప్రొడక్ట్-ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్-ప్రాసెస్’ సర్టిఫికేషన్ కిందకు తీసుకువచ్చారు.

దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల నాణ్యత, ఆహార భద్రతను నిర్ధారించడానికి ఇది ఒక ముఖ్యమైన దశ. దీనివల్ల పని మరింత సులభతరం అవుతుంది. ఇకనుంచి పాల ఉత్పత్తుల నాణ్యత గురించి పౌరులకు భరోసా ఇవ్వడానికి లోగో చూస్తే సరిపోతుంది. సంఘటిత రంగంలో పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలు కూడా పెరుగుతాయి. పాడి రైతుల ఆదాయం కూడా బాగుంటుంది. డెయిరీ రంగంలో మార్పులు కనిపిస్తాయి.

RBI: జనవరి 1 నుంచి ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ అమలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

‘రైతు అంటే పేదవాడు’ అనే భావన విడనాడాలి.. ఎందుకో కారణం చెప్పిన కేంద్ర మంత్రి

Viral Video: చలికాలం అవస్థలు.. కింద మంట పైన స్నానం.. వీడియో చూస్తే షాక్‌..