PM Modi: పాడి రైతులకు ప్రధాని మోడీ గుడ్‌న్యూస్.. బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి శంకుస్థాపన..
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్‌లో ఆవు పేడతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. దీంతో సమీపంలోని 200 గ్రామాలకు చెందిన పశువుల పెంపకందారులకు మేలు జరుగుతుంది. ఆవు పేడను విక్రయించి ఆదాయం సంపాదిస్తారు. వారణాసిలోని మిల్క్ ప్రొడక్షన్ కోఆపరేటివ్ యూనియన్ ప్లాంట్‌లో బయోగ్యాస్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తు వినియోగిస్తారు.
వారణాసి డెయిరీ ప్లాంట్ నుంచి 10 కి.మీ.ల దూరంలో దాదాపు 194 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 68.6 వేల జంతువులను గుర్తించారు. ఇవి రోజుకు 779 టన్నుల పేడను ఉత్పత్తి చేస్తాయి ఈ గ్రామాల్లో 1519 మంది రైతులను సర్వే చేశారు. సర్వేలో పాల్గొన్న 37 శాతం మంది రైతులు ఆవు పేడను క్రమం తప్పకుండా విక్రయించాలని తమ కోరికను వ్యక్తం చేశారు. వారణాసి డెయిరీలో బయోగ్యాస్ ప్లాంట్‌కు రోజుకు 100 టన్నుల పేడ అవసరమవుతుంది. దీని కోసం సుమారు 2000 పశువుల ద్వారా చుట్టుపక్కల కొన్ని గోశాలల ద్వారా పొందవచ్చు.
ఆనంద్‌లోని జకరియాపురా కంపోస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌లో ఆవు పేడ విక్రయించినందుకు రైతులకు కిలోకు రూ. 1.5 నుంచి రూ. 2 లభిస్తాయి. ప్రభుత్వ ప్రకటన ప్రకారం డెయిరీ ప్లాంట్ అవసరాలు ఆవు పేడతో తీరుతాయి. వారణాసి రైతులు పాల ద్వారానే కాకుండా ఆవు పేడ ద్వారా కూడా సంపాదించవచ్చు. నాణ్యతను బట్టి కిలోకు రూ.1.5 నుంచి రూ.2 వరకు సంపాదించవచ్చు. ఆవు పేడ విక్రయించే సమయంలో రైతులకు కిలోకు రూ.1 చొప్పున చెల్లిస్తారు. సేంద్రీయ ఎరువు కొనుగోలు సమయంలో మిగిలిన మొత్తాన్ని వారికి సబ్సిడీగా బదిలీ చేస్తారు. దాదాపు రూ.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల ప్లాంట్‌లో లీటరు పాలకు దాదాపు రూ.0.40 నికర ఆదా అవుతుంది. ఆరేళ్లలో పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందగలుగుతారు.