RBI Penalty: ఆర్బీఐ కొరఢా.. మొబిక్విక్‌, స్పైస్‌ మనీలకు భారీ జరిమానా.. ఎందుకంటే..!

RBI Penalty: నిబంధనలు పాటించని బ్యాంకలు, ఇతర సంస్థలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొరఢా ఝులిపిస్తోంది. తాజాగా రెండు సంస్థలపై జరిమానా విధించింది. పేమెంట్‌..

RBI Penalty: ఆర్బీఐ కొరఢా.. మొబిక్విక్‌, స్పైస్‌ మనీలకు భారీ జరిమానా.. ఎందుకంటే..!
Follow us

|

Updated on: Dec 24, 2021 | 7:21 AM

RBI Penalty: నిబంధనలు పాటించని బ్యాంకలు, ఇతర సంస్థలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొరఢా ఝులిపిస్తోంది. తాజాగా రెండు సంస్థలపై జరిమానా విధించింది. పేమెంట్‌ ఆపరేటర్లు అయిన మొబిక్విక్‌, స్పైస్‌ మనీపై పెనాల్టీ విధిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రెండు పేమెంట్‌ ఆపరేర్లు ఆర్బీఐ ఇచ్చిన నిబంధనలు పాటించనందున ఒక్కొక్కరికి కోటి రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేశామని ఆర్బీఐ తెలిపింది. సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ యాక్ట్‌ 2007లోని సెక్షన్‌ 26(6) ఆధారంగా నిబంధనలు పాటించనందున పేమెంట్‌ ఆపరేటర్లకు ఈ పెనాల్టీ విధించింది.

కాగా, గత వారంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.1.8 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకుకు నిబంధనలు పాటించనందున రూ.30 లక్షల జరిమానా విధించింది. అదే సమయంలో గత నెలలోనే రిజర్వ్‌ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కోటి రూపాయల జరిమానా విధించింది. ఆర్‌బీఐ తన ఆర్డర్‌లో మార్చి 31, 2018 మరియు మార్చి 31, 2019 మధ్య ఆర్థిక స్థితికి సంబంధించి ఎస్‌బిఐ పర్యవేక్షణ అంచనాకు సంబంధించి చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్డర్ ప్రకారం.. రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్‌ని పరిశీలించగా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించబడింది. రుణగ్రహీత కంపెనీల విషయంలో కంపెనీల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 30 శాతానికి పైగా షేర్లను ఎస్‌బీఐ తాకట్టు పెట్టింది.

ఇవి కూడా చదవండి:

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకు ఖాతాదారులకు ఊరట.. ఆ విధానం మరో ఆరు నెలలు పొడిగింపు

Year Ender 2021: ఈ ఏడాదిలో భారత మార్కెట్లో విడుదలైన టాప్‌ 9 కార్లు ఇవే.. ధర, ఫీచర్స్‌, ఇతర వివరాలు..!