Indian Railway: భారతీయ రైల్వే అద్భుత ఆలోచన.. కోట్లాది రూపాయలు ఆదా చేసే సరికొత్త ప్రణాళిక..!

Indian Railway: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అలాగే ఖర్చులను తగ్గించి..

Indian Railway: భారతీయ రైల్వే అద్భుత ఆలోచన.. కోట్లాది రూపాయలు ఆదా చేసే సరికొత్త ప్రణాళిక..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 24, 2021 | 8:17 AM

Indian Railway: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అలాగే ఖర్చులను తగ్గించి ఆదాయం పెంచేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వ్యయాన్ని తగ్గించి ఆదాయం పెంచుకునేందుకు భారత్‌లో ప్రధాన రైల్వే స్టేషన్‌లలో సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఉత్తర రైల్వేలోని ఢిల్లీలో ప్రధాన రైల్వే స్టేషన్‌లలోఈ సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు పనులను వేగవంతం చేస్తోంది రైల్వే శాఖ.

ఉత్తర రైల్వే ప్రకారం.. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తుగ్లకాబాద్‌ కోచ్‌ కేర్‌ సెంటర్‌, తుగ్లకాబాద్‌ డీజిల్‌ లోకో షెడ్‌, ఘజియాబాద్‌, పానిపట్‌, సమల్ఖా, గనౌర్‌, సోనిపట్‌ రైల్వే స్టేషన్‌లలో1.39MWp సామర్థ్యంతో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ, పాత ఢిల్లీ, ఢిల్లీ సరాయ్‌ రోహిల్లా, దీవానా, తుగ్లకాబాద్‌, హజ్రత్‌ నిజాముద్దీన్‌, మీరట్‌ సిటీ, డిల్లీ షాహదారా రైల్వే స్టేషన్‌లలో ఇప్పటికే సోలర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.

సోలార్‌ ప్లాంట్‌తో రైల్వకు కోటి రూపాయలు ఆదా.. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ సోలార్‌ ప్లాంట్లు మొత్తం విద్యుత్‌ వినియోగంలో 5 నుంచి 7 శాతం వరకు విద్యుత్‌ను అందిస్తున్నట్లు ఢిల్లీ డివిజన్‌ మేనేజర్‌ డింపీ గార్గ్‌ తెలిపారు. ఈ సోలార్‌ ప్లాంట్‌ 82.59 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీని వల్ల ఉత్తర రైల్వే ప్రతి సంవత్సరం రూ.4.04 కోట్లు ఆదా చేస్తోంది. ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా ఢిల్లీ డివిజన్ విద్యుత్ ఖర్చును తగ్గించడమే కాకుండా 25,554 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం తగ్గిస్తోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

RBI Penalty: ఆర్బీఐ కొరఢా.. మొబిక్విక్‌, స్పైస్‌ మనీలకు భారీ జరిమానా.. ఎందుకంటే..!

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకు ఖాతాదారులకు ఊరట.. ఆ విధానం మరో ఆరు నెలలు పొడిగింపు