Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకు ఖాతాదారులకు ఊరట.. ఆ విధానం మరో ఆరు నెలలు పొడిగింపు

RBI: బ్యాంకింగ్‌ రంగంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏదైనా లావాదేవీలు జరిపే కస్టమర్లు ఇక నుంచి క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు వివరాలు..

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకు ఖాతాదారులకు ఊరట.. ఆ విధానం మరో ఆరు నెలలు పొడిగింపు
Follow us
Subhash Goud

|

Updated on: Dec 24, 2021 | 6:36 AM

RBI: బ్యాంకింగ్‌ రంగంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏదైనా లావాదేవీలు జరిపే కస్టమర్లు ఇక నుంచి క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు వివరాలు సేవ్‌ చేసి ఉండవని ఇటీవల ఆర్బీఐ కొత్త నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కూడా వెల్లడించింది. కానీ ప్రస్తుతం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులకు ఊరట కలిగించే విషయం తెలియజేసింది. క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల టోకనైజేషన్‌ విధానాల అమలును మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు డేటాను నిల్వ చేసేందుకు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కొత్త టోకెనైజేషన్‌ విధానం 2022 జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.

కార్డుల సెక్యూరిటీ నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఇప్పుడు యూజర్లకు ఊరట కలిగించింది. కార్డుల సెక్యూరిటీ నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఇక నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఈ-కామర్స్‌ సంస్థలు, వెబ్‌సైట్‌లలో వినియోగదారుల కార్డ్ సమాచారాన్ని సేవ్ చేయలేరు అంటూ ఇప్పటికే బ్యాంకులు తమతమ ఖాతాదారులకు జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు ఉంటాయని మెసేజ్‌లను కూడా చేరవేసింది. ప్రస్తుతం రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకు కస్టమర్లకు మేలు కలిగించింది. టోకనైజేషన్‌ పాలసీతో ఆయా క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలను బహిర్గతం చేయకుండా ఆన్‌లైన్‌లో షాపింగ్‌లకు, ఇతర కొనగోళ్లకు పర్మిషన్‌ ఇచ్చింది. అయితే ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని ట్రేడ్‌ యూనియన్‌ వ్యాపారులు కోరిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ టోకనైజేషన్‌ విధానంతో పలు అంతరాయాలను కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

India Post Payments Bank: క్యాష్‌ డిపాజిట్‌, విత్‌డ్రా చేసే కస్టమర్లకు అలర్ట్‌.. ఛార్జీల బదుడు.. జనవరి 1 నుంచి అమలు

LIC Jeevan Umang Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే స్కీమ్‌.. రూ.44 పెట్టుబడితో 27 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు

వివాహత స్త్రీ కాలిమెట్టెలు పోగొట్టుకోవడం శుభమా? అశుభమా? తెలుకోండి
వివాహత స్త్రీ కాలిమెట్టెలు పోగొట్టుకోవడం శుభమా? అశుభమా? తెలుకోండి
హిట్ 3 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన హీరోయిన్..
హిట్ 3 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన హీరోయిన్..
4 రోజుల్లో EAPCET 2025 పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం నిబంధ అమలు
4 రోజుల్లో EAPCET 2025 పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం నిబంధ అమలు
ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్
ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్
JEE అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. రాత పరీక్ష తేదీ
JEE అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. రాత పరీక్ష తేదీ
ఈప్రత్యేక యాప్ తోనే ఉగ్రవాదుల నరమేథం శిక్షణ ఇచ్చింది పాక్ ఆర్మీనే
ఈప్రత్యేక యాప్ తోనే ఉగ్రవాదుల నరమేథం శిక్షణ ఇచ్చింది పాక్ ఆర్మీనే
IPS టు IAS... యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన తెలుగు కుర్రోడు!
IPS టు IAS... యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన తెలుగు కుర్రోడు!
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్..
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్..
ఇకపై ఇంటర్‌లో 6 సబ్జెక్టులు.. ఆరో సబ్జెక్టులో ఫెయిలైనా నో టెన్షన్
ఇకపై ఇంటర్‌లో 6 సబ్జెక్టులు.. ఆరో సబ్జెక్టులో ఫెయిలైనా నో టెన్షన్
గంభీర్‌కు హత్య బెదిరింపులు.. ఐసిస్ ఈమెయిల్ కలకలం!
గంభీర్‌కు హత్య బెదిరింపులు.. ఐసిస్ ఈమెయిల్ కలకలం!