India Post Payments Bank: క్యాష్‌ డిపాజిట్‌, విత్‌డ్రా చేసే కస్టమర్లకు అలర్ట్‌.. ఛార్జీల బదుడు.. జనవరి 1 నుంచి అమలు

India Post Payments Bank: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బ్యాంకింగ్‌ రంగంలో కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ నిబంధల ప్రకారం కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి...

India Post Payments Bank: క్యాష్‌ డిపాజిట్‌, విత్‌డ్రా చేసే కస్టమర్లకు అలర్ట్‌.. ఛార్జీల బదుడు.. జనవరి 1 నుంచి అమలు
Follow us

|

Updated on: Dec 22, 2021 | 12:58 PM

India Post Payments Bank: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బ్యాంకింగ్‌ రంగంలో కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ నిబంధల ప్రకారం కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. ఇక ఇండియా పోస్ట్ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఖాతా ఉన్న వారు వచ్చే ఏడాది నుంచి క్యాష్‌ విత్‌డ్రా చేసినా, డిపాజిట్‌ చేసినా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. డబ్బుల ఉపసంహరణ, డిపాజిట్‌ లావాదేవీలపై ఛార్జీలు ఉంటాయని ఇండియా పేమెంట్‌ బ్యాంక్‌ తెలిపింది. పరిమితి దాటితే ఛార్జీలు ఉంటాయని వెల్లడించింది.

అయితే ఈ ఛార్జీలు అందరికి ఒకేలా ఉండవు. వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతా ఉన్నవారికి నెలకు నాలుగు సార్లు డబ్బులను ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉపసంహరించకోవచ్చు. కానీ ఆ తర్వాత డబ్బులు ఉపసంహరించుకుంటే ఛార్జీలు తప్పవు. మొత్తంలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 లావాదేవీకి ముట్టజెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఖాతా ఉన్నవారు క్యాష్‌ డిపాజిట్‌ చేసుకోవడం ఉచితం. ఎలాంటి ఛార్జీలు ఉండవు.

ఇతర పొదుపు ఖాతాలున్నవారు నెలకు రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇది పూర్తిగా ఉచితం. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకుంటే మొత్తం 0.50 శాతం లేదా కనీసం రూ.25 వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతా కలిగిన వారు రూ.10వేల వరకు క్యాష్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ రూ.10వేలకుపైగా డిపాజిట్‌ చేసుకుంటే 0.50 శాతం లేదా రూ.25 ప్రతి లావాదేవీకి ఛార్జీలు ఉంటాయి. ఈ నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కస్టమర్ల ఈ విషయాలను గమనించడం తప్పనిసరి. లేకుంటే ఎక్కువ విత్‌డ్రాలు చేసుకుంటే అదనంగా ఛార్జీల బదులు తప్పనిసరి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Swiggy, Zomato: 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్న ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. కస్టమర్లపై భారం పడుతుందా..?

LIC Jeevan Umang Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే స్కీమ్‌.. రూ.44 పెట్టుబడితో 27 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ