AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swiggy, Zomato: 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్న ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. కస్టమర్లపై భారం పడుతుందా..?

Swiggy Zomato: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో కీలక నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 1 నుంచి జీఎస్టీని వసూలు చేయనుంది. ఈ సంస్థల యాప్స్‌ ద్వారా కస్టమర్ల..

Swiggy, Zomato: 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్న ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. కస్టమర్లపై భారం పడుతుందా..?
Subhash Goud
|

Updated on: Dec 22, 2021 | 10:57 AM

Share

Swiggy, Zomato: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో కీలక నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 1 నుంచి జీఎస్టీని వసూలు చేయనుంది. ఈ సంస్థల యాప్స్‌ ద్వారా కస్టమర్ల ఫుడ్‌ ఆర్డర్లను చేస్తే 5 శాతం జీఎస్టీని వసూలు చేయనున్నాయి. గతంలో జీఎస్టీని రెస్టారెంట్ల నుంచి వసూల చేసేవి. ఇప్పుడు ఈ సంస్థలు నేరుగా వసూలు చేయనున్నాయి. జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ జీఎస్టీ భారం కస్టమర్లకు పడబోదు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే రెస్టారెంట్లు ఐదు శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేసేవి. స్విగ్గీ, జొమాటో కేవలం తమ సేవలకు గాను కొంత మొత్తం కస్టమర్ల నుంచి వసూలు చేసేవి.

ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపు పొందని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ కొత్త నిబంధన అమలు చేయబోతోంది. ఇప్పటి వరకు పన్ను చెల్లించని రెస్టారెంట్లు కూడా పన్ను పరిధిలోకి రానున్నాయి. ఈ నిర్ణయం కారణంగా కస్టమర్లకు ఎలాంటి భారం పడబోదు. సెప్టెంబర్‌ నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. గుర్తింపులేని రెస్టారెంట్లు పన్ను పరిధిలో లేకపోవడం వల్ల రెండేళ్ల కాలంలో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లింది. కేంద్ర తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధన వల్ల కస్టమర్లకు ఎలాంటి భారం ఉండదనే విషయాన్ని అప్పట్లోనే కేంద్రం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

LIC Jeevan Umang Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే స్కీమ్‌.. రూ.44 పెట్టుబడితో 27 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు

RBI Rules: డెబిట్‌, క్రెడిట్‌ కార్డు యూజర్లు అలర్ట్‌.. ఇక నుంచి ఆ వివరాలు ఉండవు.. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?