Viral Video: చలికాలం అవస్థలు.. కింద మంట పైన స్నానం.. వీడియో చూస్తే షాక్‌..

Viral Video: వేసవికాలం పోయి చలికాలం వచ్చేసింది. రోజు రోజుకు చలి విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ఈ సీజన్‌లో స్నానం చేయడం పెద్ద టాస్క్‌.

Viral Video: చలికాలం అవస్థలు.. కింద మంట పైన స్నానం.. వీడియో చూస్తే షాక్‌..
Viral
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Dec 23, 2021 | 6:59 AM

Viral Video: వేసవికాలం పోయి చలికాలం వచ్చేసింది. రోజు రోజుకు చలి విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ఈ సీజన్‌లో స్నానం చేయడం పెద్ద టాస్క్‌. వేడి నీళ్లతో స్నానం చేస్తే చేసిన తర్వాత చల్లగా ఉంటుంది. చల్లటి నీళ్లతో స్నానం చేస్తే కూడా చల్లగా ఉంటుంది. ఈ పరిస్థితిలో చాలా మంది స్నానం చేయకుండానే పనులకు వెళుతారు. అలాంటి వారి కోసం స్నానం చేసే గొప్ప మార్గం కనిపెట్టాడు ఓ బాలుడు. స్నానం చేసేటప్పుడు వేడిగానే ఉంటుంది.. స్నానం చేసిన తర్వాత కూడా వేడిగానే ఉంటుంది. తమాషా ఏంటంటే.. ఇలా స్నానం చేయడానికి నీళ్ల ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ వీడియో చూస్తే మీరూ నవ్వుకోలేరు. ప్రస్తతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

చలికాలంలో స్నానం ఎలా చేయాలో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఒక పిల్లవాడు పొయ్యిపై ఒక పెద్ద పాన్‌ పెట్టి అందులో నీరు వేడి చేస్తూ అదే పాన్‌లోకి దిగి స్నానం చేయడం మనం వీడియోలో చూడవచ్చు. పొయ్యి కింద మంట ఎర్రగా మండుతుంది. అదే పొయ్యిపై పాన్‌లో కాగుతున్న వేడి నీటితో పిల్లాడు స్నానం చేస్తాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా స్నానం ముగిస్తాడు. వీడియో చూసిన జనాలు పిల్లాడి సాహసానికి ఫిదా అవుతున్నారు. వీడియోను షేర్, లైక్ చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఈ చిన్నారి చేసిన వింత స్నానం నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంది. మరికొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక నెటిజన్‌ పిల్లవాడు నీటిని పొదుపు చేయడం అద్భుతమని అన్నాడు. మరొకరు భారతీయులలో చాలా ప్రతిభ దాగుందని అన్నాడు. ఇంకొకరు నీటిని ఆదా చేయడంలో ఈ పిల్లాడిని మించిన వారు మరొకరు లేరని అన్నాడు. చాలామంది తమ స్పందనను తెలియజేయడం విశేషం. అయితే మీరు ఈ పిల్లాడిలా ప్రయత్నించకండి ప్రాణాలకే ప్రమాదం.

ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌.. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే జీతం.. లేదంటే అంతే సంగతులు..

సంచలన నిర్ణయం.. జనవరి 1 నుంచి వ్యాక్సిన్‌ వేసుకోని వ్యక్తులు అక్కడ తిరగడం నిషేధం..

PM Kisan: రైతులకు శుభవార్త.. కొత్త సంవత్సరం రోజున పీఎం కిసాన్ పదో విడత డబ్బులు..