AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithin Gadkari: ఆరు నెలల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను అమర్చాలి.. వాహన తయారీదారులకు కేంద్రం సూచన..

పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, వాహన తయారీదారులకు ప్రభుత్వం ఒక సూచన చేసింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు అమర్చాలని కోరింది.

Nithin Gadkari: ఆరు నెలల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను అమర్చాలి.. వాహన తయారీదారులకు కేంద్రం సూచన..
Gadkari
Srinivas Chekkilla
|

Updated on: Dec 23, 2021 | 7:57 PM

Share

పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, వాహన తయారీదారులకు ప్రభుత్వం ఒక సూచన చేసింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు అమర్చాలని కోరింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో కార్లు 100 శాతం ఇథనాల్‌తో నడపగలవని, దీంతో పెట్రోల్‌పై ఆధారపడటం తగ్గుతుందని ఆయన అన్నారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్‌లను తయారు చేయమని కార్ల తయారీదారులకు సలహా ఇచ్చే ఫైల్‌పై తను బుధవారం సంతకం చేశానని నితిన్ గడ్కరీ చెప్పారు. బహుళ ఇంధనాలతో నడిచే వాహనాల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను అమర్చేందుకు కార్ల తయారీదారులకు ఆరు నెలల సమయం ఇచ్చామని, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో వంటి కంపెనీలు తమ ద్విచక్ర వాహనాలు, త్రీవీలర్ల కోసం ఇప్పటికే కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాయని గడ్కరీ తెలిపారు. త్వరలో నాలుగు చక్రాల వాహనాలు 100 శాతం ఇథనాల్‌తో నడుస్తాయని గడ్కరీ పేర్కొన్నారు. దీంతో పెట్రోల్ అవసరం ఉండదని, గ్రీన్ ఇంధనాన్ని ఉపయోగించడం ద్వారా డబ్బు కూడా ఆదా అవుతుందని చెప్పారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు అంటే ఏమిటి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ అనేది ఒక రకమైన అంతర్గత దహన యంత్రం. ఇది ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనాలతో నడుస్తుంది. ఇందులో పెట్రోలుతో పాటు ఇథనాల్, మిథనాల్ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఫ్యూయల్ కంపోజిషన్ సెన్సార్, ECU ప్రోగ్రామింగ్ వంటి సాంకేతికత అందుబాటులోకి రావడంతో, ఇంజిన్ పరిమాణాన్ని సెట్ చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా ఇంధనాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఉత్తరప్రదేశ్‌కు 9 వేల కోట్ల ప్రాజెక్టు బహుమతి ఈ రోజు నితిన్ గడ్కరీ ఉత్తర ప్రదేశ్‌లో 9 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మీరట్, ముజఫర్‌నగర్‌లో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనున్నారు. మీరట్‌లో రూ. 8364 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించారు. ఆర్థిక వ్యవస్థలో ఇథనాల్, హైడ్రోజన్ ఇతర జీవ ఇంధనాలకు గొప్ప ప్రాముఖ్యత ఉందని ఆయన అన్నారు. మొక్కజొన్న, చెరకు నుంచి ఇథనాల్ తయారు చేస్తారని. భారతదేశంలో ఈ రెండు పంటలకు కొరత లేదన్నారు.

Read Also.. Hero motocorp: వాహనాల ధరలు పెంచనున్న హీరో మోటోకార్ప్.. ఎప్పటి నుంచి అంటే..