Hero motocorp: వాహనాల ధరలు పెంచనున్న హీరో మోటోకార్ప్.. ఎప్పటి నుంచి అంటే..

హీరో మోటోకార్ప్ తన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను జనవరి 4, 2022 నుంచి పెంచనుంది...

Hero motocorp: వాహనాల ధరలు పెంచనున్న హీరో మోటోకార్ప్.. ఎప్పటి నుంచి అంటే..
Hero Motocorp
Follow us

|

Updated on: Dec 23, 2021 | 6:12 PM

హీరో మోటోకార్ప్ తన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను జనవరి 4, 2022 నుంచి పెంచనుంది. ఈ ప్రకటనతో హీరో మోటోకార్ప్ వాటా 1.49 శాతం పెరిగి 2383.75కి చేరుకుంది. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్ కూడా 0.7 శాతం మేర లాభపడ్డాయి. వస్తువుల ధరలు పెరగడమే తమ వాహనాల ధరలను పెంచడానికి కారణమని కంపెనీ పేర్కొంది. పెరుగుతోన్న కమోడిటీ ధరల ప్రభావాన్ని పాక్షికంగా అధిగమించేందుకు ధరల పెంపు తప్పనిసరి అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2,000 వరకు ధరలు పెరగనున్నాయని, మోడల్‌, మార్కెట్‌ను బట్టి కచ్చితమైన పెరుగుదల ఉంటుందని వెల్లడించింది.

అంతకుముందు, కంపెనీ తన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను 20 సెప్టెంబర్ 2021 పెంచింది. ఆ సమయంలో కూడా పెరుగుతున్న వస్తువుల ధరల ప్రభావాన్ని తగ్గించడానికి ధర పెంచుతున్నట్లు తెలిపింది. అప్పట్లో కంపెనీ వాహనాల ధరలను రూ.3,000 వరకు పెంచింది. ఈ నెల ప్రారంభంలో, దేశీయ ఆటో కంపెనీ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను జనవరి 1 నుంచి పెంచబోతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న కమోడిటీ, ముడిసరుకు ధరల కారణంగా ధరలను 2.5 శాతం శ్రేణిలో పెంచాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు (M&HCV), లైట్ కమర్షియల్ వెహికల్స్ (I&LCV), చిన్న వాణిజ్య వాహనాల ధర పెంచుతున్నట్లు తెలిపింది.

కవాసకి ఇండియా ఈ రోజు సవరించిన వాహనాల ధరలను కూడా వెల్లడించింది. కొత్త ధరలు జనవరి 1, 2022 నుంచి వర్తిస్తాయని తెలిపింది. మా మార్కెట్‌లో అత్యంత చౌకైన కవాసకి బైక్ – నింజా-300 ధర రూ.6,000 పెరగనుంది. Z650, రెట్రో- Z650 ధరలను పెంచలేదు అయితే Ninja 650 బైక్ ధర రూ. 7,000 పెరగనుంది.

Read Also.. VPF vs PPF: VPF అంటే ఏమిటి.. PPF కంటే VPF బెటరా.. ఎందులో వడ్డీ ఎక్కువ వస్తుంది..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ