VPF vs PPF: VPF అంటే ఏమిటి.. PPF కంటే VPF బెటరా.. ఎందులో వడ్డీ ఎక్కువ వస్తుంది..

వీపీఎఫ్ అంటే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF కంటే స్వచ్ఛంద భవిష్య నిధి (VPF) ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది...

VPF vs PPF: VPF అంటే ఏమిటి.. PPF కంటే VPF బెటరా.. ఎందులో వడ్డీ ఎక్కువ వస్తుంది..
Vpf
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 23, 2021 | 3:55 PM

వీపీఎఫ్ అంటే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF కంటే స్వచ్ఛంద భవిష్య నిధి (VPF) ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు VPFలో పెట్టుబడి పెట్టడానికి ప్రత్యేక ఖాతా ఏదీ తెరవవలసిన అవసరం లేదు. ఇది కాకుండా, సెక్షన్ 80C కింద దీనిపై వచ్చే వడ్డీకి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. VPF సదుపాయం ఉద్యోగాస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పథకం. ఈ పథకం కింద, ఉద్యోగులు వారి కోరిక మేరకు తమ జీతంలో కొంత భాగాన్ని ఈ ఫండ్‌లో డిపాజిట్ చేయవచ్చు. ఈ డిపాజిట్ ప్రభుత్వం ఆదేశించిన గరిష్ఠ పరిమితి 12 శాతం PF కంటే ఎక్కువగా ఉండాలి. ఒక ఉద్యోగి VPFలో తన ప్రాథమిక జీతంలో 100% వరకు విరాళంగా ఇవ్వవచ్చు.

PPF కంటే VPFకి ఎక్కువ వడ్డీ లభిస్తుంది

వీపీఎఫ్‎కు PPF కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం, వీపీఎఫ్‌పై 8.50 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు ఒక సంవత్సరంలో గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు PPFలో పెట్టుబడి పెట్టవచ్చు. VPFలో పెట్టుబడి పెట్టడానికి పరిమితి లేదు. ఇందులో ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?

VPF ప్రయోజనాలు

VPF ఖాతాలో EPF వలె అదే వడ్డీ అందుబాటులో ఉంటుంది. ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ లాగా వీపీఎఫ్ నిధులను కూడా బదిలీ చేయవచ్చు. VPF ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతుంది. EPF లాగానే, VPF ఖాతాలో చేసిన పెట్టుబడి కూడా EEE కేటగిరీ కిందకు వస్తుంది, అంటే అందులో పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత వచ్చే డబ్బు పూర్తిగా పన్ను రహితం. డబ్బు విత్‌డ్రా ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేసుకోవచ్చు. VPF ఖాతా నుండి డబ్బును పాక్షికంగా విత్‌డ్రా చేయడానికి, ఖాతాదారు ఐదేళ్లపాటు పని చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత మాత్రమే మొత్తం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

Read Also.. Bonsai Plants: పొట్టి మొక్కలతో పుట్టెడు ఆదాయం.. అతని చిన్నప్పటి హాబీ.. సిరులు కురిపిస్తోంది..