HDFC FD Rates: ఎస్‌బీఐ బాటలోనే హెచ్‌డీఎఫ్‌సీ.. ఆ డిపాజిట్లపై వడ్డి రేట్లను పెంచిన కార్పోరేట్ బ్యాంక్.. పూర్తి వివరాలివే..
దేశంలోని అగ్రశ్రేణి బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచిన నేపథ్యంలో ఇతర బ్యాంక్‌లు కూడా అదే బాట పట్టాయి. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై
దేశంలోని అగ్రశ్రేణి బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచిన నేపథ్యంలో ఇతర బ్యాంక్‌లు కూడా అదే బాట పట్టాయి. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచిన మరుసటి రోజే దేశంలోని కార్పోరేట్ బ్యాంక్ HDFC కూడా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ మేరకు HDFC బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ప్రకటనను విడుదల చేసింది. ఇక ఈ వడ్డి రేట్లు డిసెంబర్ 14 నుంచి అమలులోకి వస్తాయి. ఫలితంగా HDFC సాధారణ కస్టమర్లు 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ లేదా 18 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7% వడ్డీ రేటును పొందవచ్చు.
HDFC బ్యాంక్ సామాన్య కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డి రేట్లు..
HDFC బ్యాంక్ సామాన్య కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డి రేట్లు ఈ విధంగా ఉన్నాయి. 7 – 14 రోజుల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకున్నవారికి 3.00% వడ్డిని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అందిస్తోంది. అలాగే 15 – 29 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 3.00%, 30 – 45 రోజులకు 3.50% , 46 – 60 రోజులకు 4.50% వడ్డిని ఇస్తోంది. ఈ క్రమంలోనే 61 – 89 రోజులకు 4.50%, 90 రోజులునుంచి 6 నెలలు లేదా అంతకు మించి అయితే 4.50%, 6 నెలల ఒక రోజు నుంచి తొమ్మిది నెలలు లేదా అంతకు మించి అయితే 5.75%, 9 నెలల ఒక రోజు నుండి నుంచి 1 సంవత్సరం అయితే 6.00% వడ్డీని ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తోంది. అలాగే 1 సంవత్సరం నుంచి 15 నెలలు లేదా ఆపై వరకు 6.50% వడ్డీ, 15 నెలల నుంచి 18 నెలలకు మించితే 7.00%, 18 నెలల నుంచి 21 నెలలకు మించితే 7.00%, 21 నెలలు నుంచి 2 సంవత్సరాల వరకు అయితే 7.00% వడ్డీని ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తోంది. ఇక 2 సంవత్సరాల ఒక రోజు నుంచి 3 సంవత్సరాలకు 7.00%, 3 సంవత్సరాల ఒక రోజు నుంచి 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై 7.00%, 5 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల వరకు చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై 7.00% వడ్డీని హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తోంది.
HDFC బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డి రేట్లు..
HDFC బ్యాంక్ ద్వారా 7 రోజుల నుంచి 5 సంవత్సరాలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రామాణిక రేటు కంటే 50 bps అదనపు వడ్డీని సీనియర్ సిటిజన్లు పొందవచ్చు. డిసెంబర్ 14న అమలులోకి వచ్చిన వడ్డీ రేట్ల తర్వాత.. సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల FDలపై 3.5 నుంచి 7.75%* వరకు వడ్డీ రేటును పొందుతారు. HDFC బ్యాంక్ ‘‘సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్’’ పేరుతో ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవను అందిస్తుంది. దీని వడ్డీ వివరాలు ఇలా ఉన్నాయి. 7 – 14 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50%, 15 – 29 రోజులయితే 3.50%. 30 – 45 రోజులకు 4.00%. 46 – 60 రోజుల ఎఫ్‌డీలపై 5.00%, 61 – 89 రోజులకు 5.00% వడ్డీని సీనియర్ సిటీజన్లు పొందగలరు. 90 రోజులు నుంచి 6 నెలలు లేదా అంతకు మించి అయితే 5.00%, 6 నెలలు ఒక రోజు నుంచి 9 నెలలు లేదా అంతకు మించి అయితే 6.25%, 9 నెలల ఒక రోజు నుంచి ఒక సంవత్సరానికి మించితే 6.50%, 1 సంవత్సరం నుంచి 15 నెలలపై వరకు 7.00%, 15 నెలల నుంచి 18 నెలలకు మించినట్లయితే 7.50% వడ్డీని సీనియర్ సిటిజన్లు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పొందగలరు. అలాగే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు సీనియర్ సిటిజన్లు హెచ్‌డీఎఫ్‌సీలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. అందుకు వారు 7.75% వడ్డీని పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..