IMDb Top 10 Movies 2022: ఈ సంవత్సరం విడుదలైన టాప్ 10 సినిమాలు ఇవే.. లిస్ట్ విడుదల చేసిన ఐఎమ్‌డీబీ..
ఇంకో పదిహేను రోజులతో 2022 సంవత్సరం ముగిసిపోతుంది. ఈ సంవత్సరంలో భారతీయ సినీ పరిశ్రమ నుంచి అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. ఇక దక్షిణాది సినిమాలు అయితే మంచి కంటెంట్‌తో భారత సినీ..
ఇంకో పదిహేను రోజులతో 2022 సంవత్సరం ముగిసిపోతుంది. ఈ సంవత్సరంలో భారతీయ సినీ పరిశ్రమ నుంచి అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. ఇక దక్షిణాది సినిమాలు అయితే మంచి కంటెంట్‌తో భారత సినీ పరిశ్రమను ఊపేశాయి. బాలీవుడ్ చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అయితే దేశవ్యాప్తంగా వార్తలలో నిలిచిన సినిమా అని చెప్పుకోవాలి. కాశ్మీరీ పండితులపై జరిగిన దాడుల గురించి హృదయం కరిగేలా దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయేలా ఎన్నో సినిమాలు 2022లో విడుదలయ్యాయి. అయితే కొన్ని రోజులలో ఈ సంవత్సరానికి విడ్కోలు పలకనున్న సందర్భంగా.. ఈ ఏడాది విడుదలైన టాప్ 10 సినిమాల జాబితాను IMDb బుధవారం విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ క్రమంలోనే అనుపమ్ ఖేర్ నటించిన ది కాశ్మీర్ ఫైల్స్ రెండో స్థానంలో, కన్నడ నటుడు యష్ ముఖ్య పాత్రగా నటించిన KGF 2 మూడో స్థానంలో ఉన్నాయి. టాలివుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన RRR అయితే అన్ని ప్రాంతాల నుంచి ప్రశంసలను అందుకుంది. ఇలా అందరినీ మెప్పించి IMDb టాప్ 10లో నిలిచిన సినిమాలు ఏమిటో చూద్దాం..
RRR (రైజ్ రోర్ రివోల్ట్)
టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయా సరన్ ముఖ్యపాత్రలలో నటించారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ ,బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ (నాటు నాటు)లకు RRR నామినేట్ అయింది. ఈ ఏడాది మార్చిలో విడుదలై ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1,200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ‘RRR’ IMDb టాప్ 10 జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. RRR IMDb రేటింగ్: 8/10
కాశ్మీర్ ఫైల్స్
‘ది కాశ్మీర్ ఫైల్స్’ విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్ ముఖ్యపాత్రలలో నటించిన ఈ చిత్రం.. 1990లో కాశ్మీరీ పండిట్ల హృదయ విదారకమైన వలసల గురించి చూపుతుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశంలో రూ. 252 కోట్లకు పైగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 340కి పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద నిలిచింది. ఇక ‘RRR’ IMDb టాప్ 10 జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కాశ్మీర్ ఫైల్ IMDb రేటింగ్: 8.3/10
KGF: చాప్టర్ 2
2018లో విడుదలయిన KGF: చాప్టర్ 1 సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన KGF: చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కోసం జరిగే గొడవల నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాలో కన్నడ నటుడు యష్ నటన ప్రధానమైనదిగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో రాకీ(యష్) నారాచి ప్రజలకు వీరుడు, రక్షకుడు. తన తల్లికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అతను అధీర, ఇనాయత్ ఖలీల్, రమిక సేన్ వంటి వారి కారణంగా అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక 2022లో విడుదలయిన ఈ సినిమా IMDb టాప్ 10 జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. KGF 2 IMDb రేటింగ్: 8.4/10
విక్రమ్
.భారతదేశ గూఢచార సంస్థ RAW కోసం పనిచేసే ఏజెంట్ అరుణ్ కుమార్ పాత్రలో కమల్ హసన్ నటించిన సినిమా ‘విక్రమ్’. ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి విలన్‌గా నటించగా, మలయాళ సినిమా స్టార్ ఫహద్ ఫాజిల్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా IMDb టాప్ 10 జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. విక్రమ్ IMDb రేటింగ్: 8.4/10
కాంతారా
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీగా ప్రజాదరణ పొందడమే కాక బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్ కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సీక్వెల్‌ను కూడా ప్రారంభించే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా IMDb టాప్ 10 జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. కాంతారా IMDb రేటింగ్: 8.6/10
రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్
జూలై 1న థియేటర్లలో విడుదలైన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ విమర్శకుల నుంచి , ప్రేక్షకుల నుంచి విశేష స్థాయిలో ప్రశంసలందుకుంది. R. మాధవన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ బయోగ్రాఫికల్ డ్రామా.. ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో నంబి నారాయణన్ పాత్రను మాధవన్ పోషించారు. IMDb టాప్ 10 జాబితాలో ఈ సినిమా ఆరో స్థానంలో నిలిచింది. రాకెట్రీ: నంబి ఎఫెక్ట్ IMDb రేటింగ్: 8.8/10
మేజర్
అడివి శేష్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన ‘మేజర్’ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్’ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి తెరకెక్కిన సినిమా. IMDb టాప్ 10 జాబితాలో ఈ సినిమా ఏడో స్థానంలో నిలిచింది. మేజర్ IMDb రేటింగ్: 8.2/10
సీతా రామం
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన సీతా రామం చిత్రం మొదట తెలుగు, తమిళం, మలయాళంలో విడుదలైంది. ఆ తరువాత హిందీలోనూ అలరించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతా రామం’లో రష్మిక మందన్న కూడా నటించింది. యుద్ధం, సరిహద్దులు, మతం కంటే మానవత్వం ముఖ్యం అనే సందేశాన్ని ఈ చిత్రం ప్రేక్షకులకు చూపుతుంది. IMDb టాప్ 10 జాబితాలో ఈ సినిమా ఎనిమిదో స్థానంలో నిలిచింది. సీతా రామం IMDb రేటింగ్: 8.6/10
పొన్నియిన్ సెల్వన్: మొదటి భాగం
ఐశ్వర్యరాయ్ బచ్చన్, విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష కృష్ణన్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, పార్తీబన్ ప్రధాన పాత్రలలో నటించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ బాక్సాఫిస్ వద్ద పెద్ద ఎత్తునే ప్రజాదరణను పొందింది. మాగ్నమ్ ఓపస్ హిస్టారికల్ డ్రామా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా IMDb టాప్ 10 జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. పొన్నియిన్ సెల్వన్: మొదటి భాగం IMDb రేటింగ్: 7.9/10
777 చార్లీ
కిరణ్‌రాజ్. కే దర్శకత్వం వహించిన ‘777 చార్లీ’లో రక్షిత్ శెట్టితో పాటు టైటిల్ రోల్‌లో లాబ్రడార్ కుక్క చార్లీ నటించింది. ఈ చిత్రంలో సంగీత శృంగేరి, రాజ్ బి. శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా కూడా ప్రధాన పాత్రలలో నటించారు. కొంటెగా, చురుకుగా ఉండే చార్లీ అనే కుక్క హీరో జీవితంలోకి ప్రవేశించి అతనిని ముందుకు నడిపిస్తుంది. ఇక ఈ సినిమా IMDb టాప్ 10 జాబితాలో పదో స్థానంలో నిలిచింది. 777 చార్లీ IMDb రేటింగ్: 8.9/10