Inaya Sultana: ఇనయా సుల్తానా రెమ్యునరేషన్ వివరాలు.. మొత్తం ఎంత ఇచ్చారంటే ??
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో ముగింపు దశకు చేరుకుంటున్న కొద్ది ఊహించని ట్విస్ట్ లు అయితే చోటు చేసుకుంటున్నాయి.
Updated on: Dec 15, 2022 | 12:23 PM

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో ముగింపు దశకు చేరుకుంటున్న కొద్ది ఊహించని ట్విస్ట్ లు అయితే చోటు చేసుకుంటున్నాయి.

కొన్నిసార్లు బిగ్ బాస్ నీరసంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ మరికొన్నిసార్లు కంటెస్టెంట్స్ వారి స్ట్రాటజీ తో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

టాప్ 5 ఫైనలిస్టులలో ఇనయా ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. అయితే అనూహ్యంగా 14వ వారంలో ఆమె బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికొచ్చింది.

ఇక బిగ్ బాస్ లో 14 వారాలు ఉన్నందుకు ఆమెకు మంచి రెమ్యునరేషన్ కూడా అందినట్లుగా తెలుస్తోంది.

ఆమె వారానికి రూ.15 వేల రూపాయలను అందుకుంటూ వచ్చింది. ఒక విధంగా బిగ్ బాస్ లో ఈసారి అతి తక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో ఇనయా సుల్తానా కూడా ఉంది.

ఇక ఆమె మొత్తం 14 వారాలకు గాను రెండు లక్షల పదివేల రూపాయలు సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.




