National Anthem: ఈ వీడియోను చూస్తే మీ మనసు పులకించక మానదు.. సైన్ లాంగ్వేజ్‌లో జాతీయ గీతం పాడిన విద్యార్థులు..
నాగ్‌పూర్‌లోని కేంద్రీయ విద్యాలయ VSN లో చదువకుంటున్న విద్యార్థులంతా కలసి సంకేత భాషలో మన దేశ జాతీయ గీతాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోను..

నాగ్‌పూర్ కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు దేశ ప్రజల మనసులను గెలుచుకునేలా ఓ ప్రదర్శన చేశారు. వారు చేసిన పని ఏమిటో తెలిస్తే ఏ భారతీయుడైనా నిలిచి నమస్కరించాల్సిందే. అంతేకాక హృదయం పులకించిపోక మానదు. నాగ్‌పూర్‌లోని కేంద్రీయ విద్యాలయ VSN లో చదువకుంటున్న విద్యార్థులంతా కలసి సంకేత భాషలో మన దేశ జాతీయ గీతాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోను కేంద్రీయ విద్యాలయ సంగతన్(కెవిఎస్) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. మనసును హత్తుకునేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించడమే కాక కేంద్రీయ విద్యాలయ విద్యార్థులను అభినందిస్తున్నారు.
ఈ వీడియోలో.. నాగ్‌పూర్ కేంద్రీయ విద్యాలయ VSNలో ఉదయం వేళ స్కూల్ అసెంబ్లీ సందర్భంగా విద్యార్థులు సంకేత భాషలో జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని మనం చూడవచ్చు. ఈ చిన్నారులు తమ చేతులతో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. సంకేత భాషలో జాతీయ గీతాన్ని ఆలపించడం కోసం బధిర విద్యార్థులను చేర్చడంలో పెద్ద అడుగు. ట్విట్టర్‌లోని ఈ వీడియో చూసి నెటిజన్లంతా ఆనంద ముగ్ధులయ్యారు. అంతేకాక చాలా మంది పిల్లలకు సంకేత భాషపై అవగాహన ఉందని నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ వీడియో చూసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Good Morning from Kendriya Vidyalaya VSN Nagpur!
Singing of National Anthem in Sign Language during Morning Assembly.#KVS #KendriyaVidyalaya @kvvsnnagpur @EduMinOfIndia @PIBHRD @mygovindia pic.twitter.com/GXQi4HSYLr
— Kendriya Vidyalaya Sangathan (@KVS_HQ) December 13, 2022
వికలాంగ విద్యార్థులకు సాధికారత
కేంద్రీయ విద్యాలయ అసోసియేషన్ ట్విట్టర్‌లో వీడియోను ట్వీట్ చేయడంతో పాడు ‘‘గుడ్ మార్నింగ్ కేంద్రీయ విద్యాలయ VSN నాగ్‌పూర్.. ఉదయం అసెంబ్లీలో సంకేత భాష ద్వారా జాతీయ గీతం ఆలాపన’’ అని కాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ ‘జాతీయ విద్యా విధానం 2020 ను అమలు చేయడానికి మార్గం సుగమం అయింది. భారతీయ పాఠశాలల్లో సంకేత భాషను ఒక భాషా సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టడం అనేది.. లక్షలాది మంది వికలాంగ విద్యార్థులను శక్తివంతం చేయడానికి తీసుకున్న అనేక చర్యలలో ఒకటి’’ అని తెలిపారు.
పాఠశాలల్లో సంకేత భాష బోధన
2021లో అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో భారతీయ సంకేత భాషను బోధించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు దానిని అభ్యసించేందుకు ఎంపిక చేసుకోవచ్చని ప్రధాని మోదీ అన్నారు. ఇలా చేయడం ద్వారా భారతీయ సంకేత భాషను ప్రోత్సహించడమే కాక వికలాంగులకు సహాయం చేస్తుందన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లీక్ చేయండి



