సేంద్రీయ వ్యవసాయదారులకు గుడ్ న్యూస్.. ఇక సులభంగా మీ పంటను ఎలా అమ్ముకోవచ్చో తెలుసుకోండి..
రైతులు పంట పండిచడం ఒక ఎత్తైతే.. దానిని విక్రయించడం మరో ఎత్తు. కొన్ని సందర్భాల్లో పండించిన పంటకు గిట్టుబాటుధర లభించక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కేంద్రప్రభుత్వం కొన్ని పంటలకు మద్దతు ధర..
రైతులు పంట పండిచడం ఒక ఎత్తైతే.. దానిని విక్రయించడం మరో ఎత్తు. కొన్ని సందర్భాల్లో పండించిన పంటకు గిట్టుబాటుధర లభించక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కేంద్రప్రభుత్వం కొన్ని పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుండటంతో వ్యవసాయ దారులకు సానుకూలమైన అంశమే అయినప్పటికి.. రైతులకు గిట్టుబాటు ధర దొరకడం కష్టంగానే మారింది. ఇటీవల కాలంలో సేంద్రీయ పంటకు డిమాండ్ పెరుగుతోంది. ఆరోగ్య ప్రయోజనాలను కాంక్షించే వ్యక్తులు సేంద్రీయ వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సేంద్రీయ వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కాని సేంద్రియ రైతులు తమ పంటలను ఎక్కడ విక్రయించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది తాము పండించిన పంటలను స్థానిక మార్కెట్‌లో అక్కడి ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో సేంద్రీయ వ్యవసాయదారులు తమ పంట ఉత్పత్తులను లాభసాటిగా ఎలా విక్రయించుకోవాలో తెలుసుకుందాం. దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
భూమి ఉత్పాదకత , ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో రైతులు కూడా సేంద్రీయ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. కాని సేంద్రియ పంటలు పండించిన రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడ విక్రయించుకోవాలో తెలియక తరచుగా ఆందోళన చెందుతూ ఉంటారు. సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్ దేశంలో ఇప్పటికి పెద్దగా అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పండించిన పంటలను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. వారికి రావాల్సిన లాభాలు పొందలేకపోతున్నారు. అలాంటి రైతులకు లబ్ధికలిగేలా ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. https://www.jaivikkheti.in/ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా రైతులు తమ పంటలను సరసమైన ధరకు విక్రయించుకోవచ్చు. రైతులు ఈ వెబ్ సైట్‌ను ఉపయోగించి పంటను విక్రయించుకోవడం ద్వారా మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
ఈ వెబ్‌సైట్‌లో పంట ఉత్పత్తులు విక్రయించే రైతులు తమ దిగుబడి జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అన్ని నిబంధనలను పాటించినప్పుడే దానిని ఆర్గానిక్ ప్రొడక్ట్ అని పిలుస్తారు. రైతు పండించిన పంట సేంద్రీయమని ఆర్గానిక్ ఉత్పత్తులను గుర్తించే సంస్థ ధృవీకరించబడాలి. ఆ తర్వాత మాత్రమే రైతు దానిని https://www.jaivikkheti.in/ వెబ్‌సైట్ ద్వారా విక్రయించుకోవచ్చు.
దేశంలో సేంద్రీయ వ్యవసాయానికి ధృవీకరణ అవసరం. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సందర్శించి.. అక్కడ సంబంధి అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. భూమికి సంబంధించిన సమాచారం ఆధారంగా సేంద్రీయ వ్యవసాయ ధృవీకరణ పత్రం జారీ చేయబడుతుంది. సేంద్రీయ వ్యవసాయం వలన నేల సారాన్ని పెంచుతుంది. నీటిపారుదల విరామం పెరుగుతుంది. రసాయనిక ఎరువులపై ఆధారపడటం తగ్గించడం వల్ల ఖర్చులు తగ్గుతాయి. పంట ఉత్పాదకత పెరుగుతుంది. మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. సేంద్రియ ఎరువును ఉపయోగించడం ద్వారా నేల నాణ్యత మెరుగుపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..