Ola Scooter Difference : ఈ స్కూటర్లు చూడడానికి ఒకేలా ఉన్నా ఇన్ని తేడాలా? ఓలా స్కూటర్ల ప్రత్యేకతను తెలుసుకుందామా?
మొదట ఓలా ఎస్, ఓలా ఎస్ 1ను రిలీజ్ చేసిన కంపెనీ తర్వాత ఓలా ఎస్ 1 ఎయిర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఓలా ఎస్1, ఎస్ 1 ప్రో మూడు వేరియంట్లల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంచింది.

ప్రస్తుతం భారత్‌లో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఓలా కంపెనీ మూడు మోడల్స్‌ల్లో స్కూటర్లను విడుదల చేసింది. మొదట ఓలా ఎస్, ఓలా ఎస్ 1ను రిలీజ్ చేసిన కంపెనీ తర్వాత ఓలా ఎస్ 1 ఎయిర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఓలా ఎస్1, ఎస్ 1 ప్రో మూడు వేరియంట్లల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఓలా ఎస్ 1 ఎయిర్ కూడా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అయితే దీని ధర రూ.84,999గా ఉంటే ఓలా ఎస్ 1 మాత్రం రూ.99,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రోకు మధ్య పెద్దగా వ్యత్యాసాలు లేకపోయినా ఎస్ 1, ఎస్1 ఎయిర్ మాత్రం చెప్పుకోదగిన వ్యత్యాసాలు ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
డిజైన్
ఓలా ఎస్1, ఎస్ 1 ఎయిర్ చూడడానిక ఒకేలా ఉన్నా నిశితంగా పరిశీలిస్తే మాత్రం డిజైన్‌లోని తేడాలను గమనించవచ్చు. ఓలా ఎస్ 1 ఎయిర్ బేసిక్ వేరియంట్ అని ఇట్టే గమనించవచ్చు. దిగువ బాడీ ప్యానెల్స్, గ్రాబ్ హ్యాండిల్స్, సింగిల్ సైడెడ్ ఫ్రంట్ సస్పెన్షన్, డబుల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు ఆకట్టుకుంటాయి. ఓలా ఎస్1 స్కూటర్ మాట్ బ్లాక్, ఆంత్రా సైట్ గ్రే, మిలినియల్ పింక్, మార్ష్ మెల్లో వంటి అదనపు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఓలా ఎస్ 1 ప్రోలో అయితే ఖాకీ రంగు కూడా అందుబాటులో ఉంటుంది.
పనితీరు
ఓలా ఎస్, ఎస్ 1 ప్రో వెర్షన్స్‌లో 8.5 కేడబ్ల్యూ మోటర్ వస్తుంది. అయితే ఎస్ 1 లో 2కెడబ్ల్యూహెచ్, 3 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీలు ఉంటాయి. గంటకు 90 నుంచి 95 కిలోమీట్లర్ల వేగంతో వెళ్తాయి. ఎస్ 1 ప్రో అయితే 116 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తుంది. కేవలం 2.9 సెకన్ల నుంచి 4.5 సెకన్లలో ఈ స్కూటర్లు సున్నా నుంచి 60 కిలో మీటర్ల స్పీడ్‌ను అందుకుంటాయి. ఓలా ఎస్ 1 ఎయిర్ 2,3,4 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీలతో జత చేసిన 4.5 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. అన్ని వేరియంట్లు 85 కిలో మీటర్ల పరిధి వద్ద పరిమితం చేశారు. అలాగే ఎస్ 1 ఎయిర్ యాక్సలరేషన్ గణాంకాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.



పరిధి, చార్జింగ్
ఓలా ఎస్ ఎయిర్ బ్యాటరీ పరిధిని బట్టి 85, 125, 165 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అలాగే ఓలా ఎస్ 1 కూడా 91, 141, 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయి. అయితే ఓలా ఎస్1 ప్రోతో పోలిస్తే ఎస్ 1 పరిధి విషయంలో కొంచెం వెనుకబడి ఉంటుంది. ఈ అన్ని బైక్‌లు చార్జింగ్ చేయడానికి బ్యాటరీ పరిధిని బట్టి 2.5 గంటల నుంచి 6.5 గంటల మధ్య సమయం పడుతుంది.
లక్షణాలు
అన్ని స్టాండర్డ్ వేరియంట్లల్లో కొన్ని కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ మూవ్ ఓఎస్ 3 సాఫ్ట్ వేర్‌తో 7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే వస్తుంది. అలాగే ఓలా ఎస్ 1లైనప్ పూర్తి ఎల్ఈడీ లైటింగ్, డ్రైవ్ మోడ్స్‌తో వస్తుంది. 34 లీటర్ల సీట్ స్టోరేజి కెపాసిటీ, కాంబి బ్రేకింగ్ సిస్టమ్, నావిగేషన్ వంటి ఫీచర్లు వస్తాయి. ఓలా ఎస్ 1 ఎయిర్ సమర్థవంతమైన పొజిషనింగ్ కారణంగా ప్రెస్‌డ్ వీల్స్‌తో వస్తుంది.
ఈ ప్రత్యేకతలను పరిగణలోకి తీసుకుని మీకు కావాల్సిన స్కూటర్లను ఎంచుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..




