Ola Electric Scooter: న్యూ లుక్ లో ఓలా ఈ-స్కూటర్.. చూడటానికి ఎంత ముచ్చటగా ఉందో! మొత్తం ఐదు కొత్త రంగుల్లో..
ఈ విషయంలో ఓలా కంపెనీ మిగిలిన కంపెనీల కన్నా ఒక అడుగు ముందే ఉంటుంది. అందుకే దేశంలోనే నంబర్ వన్ ఈవీ తయారీదారుగా నిలిచింది. ఈ నేపథ్యంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 కు సంబంధించి ఓ ప్రత్యేక అప్ డేట్ ఇచ్చింది.
ప్రస్తుతం మార్కెట్ లో అంతా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. అందుకు తగినట్లు గానే కంపెనీలు తమ ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాయి. సరికొత్త ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ విషయంలో ఓలా కంపెనీ మిగిలిన కంపెనీల కన్నా ఒక అడుగు ముందే ఉంటుంది. అందుకే దేశంలోనే నంబర్ వన్ ఈవీ తయారీదారుగా నిలిచింది. ఈ నేపథ్యంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 కు సంబంధించి ఓ ప్రత్యేక అప్ డేట్ ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐదు కొత్త రంగుల్లో..
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తన ఓలా ఎస్ 1 వేరియంట్ ను ఐదు కొత్త రంగులలో ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కలర్స్ కు అదనంగా మార్ష్‌మల్లో, మిలీనియల్ పింక్, ఆంత్రాసైట్ గ్రే, మిడ్‌నైట్ బ్లూ , మ్యాట్ బ్లాక్ లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. ఈ ఐదు రంగులతో కలపి ఇప్పటి వరకూ ఓలా ఎస్1 స్కూటర్ మొత్తం 11 రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
కొత్త ఎడిషన్..
వినియోగదారుల అవసరాలను ఎప్పటికప్పుడు గమినిస్తూ తమ ఉత్పత్తులను అప్ గ్రేడ్ చేయడంలో ఓలా ముందువరుసలో ఉంటుంది. అందుకే తమ ఎస్1, ఎస్1 ప్రో వేరియంట్లో గెరువా ఎడిషన్ ను ఆవిష్కరించింది. దీనిలో మరిన్ని అత్యాధునిక ఫీచర్లు ఉన్నట్లు సమాచారం.
దేశంలోనే నంబర్ వన్..
2022 వ సంవత్సరంలో ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దేశంలోనే నంబర్ పొజిషన్ ను సొంతం చేసుకుంది. మొత్తం 1,50,000 యూనిట్లను విక్రయించి రికార్డు నెలకొల్పింది.
ఎస్1 వివరాలు మరోసారి..
ఓలా ఎస్1 కేవలం 3 సెకన్లలో 0 kmph నుంచి 40kmph వరకు వెళ్లగలదు. అలాగే గరిష్టంగా 115 కి.మీ. వెళ్లగలదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ 181 కిమీల వరకు వెళ్తుంది. దీనిలో రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ ఫీచర్లు ఉంటాయి. నార్మల్, స్పోర్ట్, హైపర్ మోడ్స్‌లో పనిచేస్తుంది. స్కూటర్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 181 కి.మీ. మైలేజీ వస్తుంది. ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు కేవలం 18 నిమిషాల్లో 50శాతం రీచార్జ్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..