Petrol Scooter to Ola Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై అదిరిపోయే ఎక్స్ చేంజ్ ఆఫర్స్.. ఇలా చేస్తే కొత్త స్కూటర్ మీ సొంతం
ఓలా కంపెనీ పెట్రోల్ స్కూటర్ పై భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ ను కల్పిస్తుంది. అయితే ఈ ఎక్స్ చేంజ్ ఆఫర్ ను ఎలా పొందాలో? ఓ సారి చూద్దాం.
పెరుగుతున్న పెట్రోల్ రేట్ల నేపథ్యంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా పెరుగుతుంది. కేంద్రం కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై రాయితీ కల్పించడంతో సామాన్యుడు వాటి కొనుగోలు పై మొగ్గు చూపుతున్నాడు. అయితే ఇప్పటికే ఉన్న స్కూటర్ లేదా బైక్ ఏం చేయాలి? ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకునే సమయంలో వారు ఎక్స్ చేంజ్ ఆఫర్ చేయరు. ఎక్స్ చేంజ్ లో అయితే ఎక్కువ డబ్బు వస్తుంది. అలా అని బయట అమ్మితే అంత డబ్బు రావడం లేదని సగటు కొనుగోలుదారులు ఆవేదన చెందుతున్నారు. దీంతో ఇలాంటి ఇబ్బందులన్నీ పరిగణలోకి తీసుకున్న ఓలా కంపెనీ పెట్రోల్ స్కూటర్ పై భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ ను కల్పిస్తుంది. అయితే ఈ ఎక్స్ చేంజ్ ఆఫర్ ను ఎలా పొందాలో? ఓ సారి చూద్దాం.
ముందుగా మీ పాత స్కూటర్ ను మొదటిగా ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ కు తీసుకెళ్లాలి. అక్కడ ఉండే సిబ్బంది మీ బండి స్థితిని, తిరిగిన కిలోమీటర్లను, కంపెనీను బేరీజు వేసుకుని ధరను నిర్ణయిస్తారు. ఓలా స్కూటర్ ధరలో నుంచి నిర్ణయించిన ధరను మినహాయించి మిగిలిన మొత్తాన్ని చెబుతారు. అది మీకు సమ్మతమైతే మిగిలిన మొత్తాన్ని చెల్లించి హ్యాపీగా మీరు కొత్త ఓలా స్కూటర్ ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.
ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ ప్రత్యేకతలు
ఓలా ప్రస్తుతం భారతదేశంలో బాగా విస్తరించింది. దేశవ్యాప్తంగా ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ లే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. దాదాపు 108 సెంటర్లు దేశంలో ఉన్నాయి. ఇక్కడ ఓలా ఎస్ 1 స్కూటర్ ను టెస్ట్ రైడ్ చేయవచ్చు. అలాగే ఈఎంఐ ఎంపికలో ఎస్ 1 డాక్యుమెంటేషన్, బ్యాంక్ ఫైనాన్సింగ్, స్కూటర్ డోర్ డెలివరీ వంటి సేవలను పొందవచ్చు. ఈ స్కూటర్ రెగ్యులర్ చెక్ అప్, అలాగే సర్వీసింగ్ వంటి సేవలను కూడా పొందవచ్చు.
ఓలా ఎస్ 1 స్పెసిఫికేషన్లు ఇవే
ఓలా ఎస్ 1 ఆగస్టు 2022లో రిలీజ్ అయ్యింది. పది కంటే ఎక్కువ కలర్స్ లో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. రూ.84,999 కు ఇది అందుబాటులో ఉంటుంది. మిగిలిన ట్యాక్స్ ఈ ధరకు అదనమని గుర్తుంచుకోవాలి. కేవలం రూ.1999 చెల్లించి దీన్ని మీరు ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు. ఓ సారి చార్జ్ చేస్తే ఈ స్కూటర్ 181 కిలో మీటర్లు వెళ్తుంది అలాగే గంటకు గరిష్టంగా 116 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. అత్యాధునిక బ్రేకింగ్ సిస్టమ్ ఈ స్కూటర్ ప్రత్యేకత.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయడి..