WhatsApp technique: చేతితో పని లేకుండానే వాట్సాప్ లో మెసేజ్, కాల్స్ చేసే టెక్నిక్.. చాలా ఈజీ..

ఎప్పుడూ చేతితో టైప్ చేసి పంపడం ఇబ్బందిగా మారవచ్చు. అటువంటి వారి కోసం ఓ మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. దానిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా చేతితో టైప్ చేయకుండానే ఎంచక్కా మెసేజ్ లను అవతలి వ్యక్తికి పంపుకోవచ్చు.

WhatsApp technique: చేతితో పని లేకుండానే వాట్సాప్ లో మెసేజ్, కాల్స్ చేసే టెక్నిక్.. చాలా ఈజీ..
Whatsapp
Follow us

|

Updated on: Feb 07, 2023 | 2:15 PM

ప్రస్తుత సమాజంలో దాదాపు స్మార్ట్ ఫోన్ మనిషి లేడు.. ఆ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ లేని వారు లేరు. ప్రపంచంలో అత్యంత విరివిగా వినియోగించబడుతున్న ఏకైక మెసేజింగ్ యాప్ వాట్సాప్. అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ వినియోగదారులకు సమాచార మార్పిడికి బెస్ట్ చాయిస్. అందుకే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు బిలియన్ల వినియోగదారులు దీనిని వినియోగిస్తున్నారు. మనుష్యుల మధ్య బంధాలను బలపరడానికి, వారి మధ్య సమాచారాన్ని సులువుగా వేగంగా చేరవేయడానికి, ఆలోచనలు పంచుకోడానికి ఇలా ఒకటేమిటే అన్నింటికీ వేదిక అదే. ఫ్యామిలీ, ఆఫీస్, పర్సనల్ అంటూ అనేక రకాల గ్రూప్స్, చాట్స్ చేస్తూ వాట్సాప్ లోనే సగం రోజు గడిపేవారు ఉన్నారు. కేవలం మెసేజ్ మాత్రమే కాక, పర్సనల్ ఫోన్ కాల్స్, గ్రూప్ ఫోన్ కాల్స్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంది. అయితే ఎక్కువ వాట్సాప్ వినియోగించే వారికి చేతితో మెసేజ్ లు చేయడం కష్టతరం కావచ్చు. ఎప్పుడూ చేతితో టైప్ చేసి పంపడం ఇబ్బందిగా మారవచ్చు. అటువంటి వారి కోసం ఓ మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. దానిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా చేతితో టైప్ చేయకుండానే ఎంచక్కా మెసేజ్ లను అవతలి వ్యక్తికి పంపుకోవచ్చు. ఇంతకీ ఏంటా ఆప్షన్? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? చూద్దాం రండి..

గూగుల్ అసిస్టెంట్..

చేతితో మెసేజ్ చేయకూడదు అనుకొనే వారికి బెస్ట్ ఆప్షన్ వాయిస్ గూగుల్ అసిస్టెంట్. దీనిని ఉపయోగించుకొని ఎంచక్కా చేతితో టైప్ చేయకుండానే మనకు కావాలి అనుకున్న వారికి మెసేజ్ లు చేసేసుకోవచ్చు. దానిని ఎలా సెట్ చేసుకోవచ్చో చూడండి..

ఆండ్రాయిడ్ యూజర్లు ఇలా సెట్ చేసుకోవాలి..

ఇవి కూడా చదవండి

మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే దానిలో గూగుల్ అసిస్టెంట్ మీకు మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. దీని ద్వారా చాలా టైం సేవ్ అవుతుంది. దీనిని వినియోగించుకోవాలంటే మొదటగా గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ మీ ఫోన్ లో ఎనేబుల్ చేసుకోవాలి. దానిని ఎలా ఏనేబుల్ చేసుకోవాలి? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

  • మీ ఫోన్ లో గూగుల్ ను ఓపెన్ చేయాలి.
  • దానిలో కుడిచేతి వైపు కింద ఉన్న మోర్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లి గూగుల్ అసిస్టెంట్ ఎంపిక చేసుకొని అసిస్టెంట్ టాబ్ పై క్లిక్ చేయాలి.
  • దానిలో అసిస్టెంట్ డివైజెస్ లిస్ట్ కనిపిస్తుంది. ఆ లిస్ట్ నుంచి ఫోన్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. వాయిస్ ను సెట్ అప్ చేసుకోవాలి.
  • అప్పుడు గూగుల్ మిమ్మల్ని ఓకే గూగుల్, హే గూగుల్ అనమని సూచిస్తుంది. ఆ వాయిస్ ని అది రికార్డ్ చేసుకొని, ఏనేబుల్ చేస్తుంది.

ఇప్పుడు మీరు వాట్సాప్ నుంచి మెసేజ్ చేయాలి అనుకున్నప్పుడు.. చేతితో సంబంధం లేకుండా మీరు మెసేజ్ చేయాలనుకుంటున్న వ్యక్తి పేరు చెప్పి, వాట్సాప్ ద్వారా పంపమని నోటితో కమాండ్ ఇస్తే సరిపోతుంది. ఉదాహరణకు ‘హే గూగుల్ సెండ్ ఏ మెసేజ్ టు రాహుల్ త్రూ వాట్సాప్’ అంటే చాలు ఎంచక్కా రాహుల్ అనే వ్యక్తికి మీరు చెప్పాలనుకున్న మెసేజ్ వాట్సాప్ ద్వారా వెళ్లిపోతుంది. అలాగే కాల్స్ చేయాలన్నా ఇదే విధానాన్ని పాటించాలి. అయితే గూగుల్ అసిస్టెంట్ పనిచేయాలంటే మీ ఫోన్ మొదట అన్ లాక్ అయ్యి ఉండాలి.

ఐఫోన్ యూజర్లు ఇలా..

మీరు ఒక వేళ ఐ ఫోన్ వినియోగిస్తున్నట్లయితే చేతితో టైప్ చేయకుండా మెసేజ్ చేయాలంటే సిరి అనే ఆప్షన్ ను మీ ఫోన్ లో ఏనేబుల్ చేసుకోవాలి. దానికి ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..

  • మీ ఐ ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లండి.
  • కిందికి స్క్రోల్ చేసి సిరి అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకొని సెర్చ్ బటన్ ని క్లిక్ చేయాలి.
  • లిజన్ ఫర్ హే సిరి ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
  • అది చెప్పే సూచనలు ఫాలో అవుతూ వాయిస్ ను సెట్ చేసుకోండి.

ఒక్కసారి సిరి ఏనేబుల్ అయితే.. అప్పుడు మీరు జస్ట్ ఫోన్ తీసుకొని హే సిరి సెండ్ త వాట్సాప్ మెసేజ్ టూ అని కమాండ్ ఇస్తే చాలు మెసేజ్ వెళ్లిపోతుంది. ఐ ఫోన్ లాక్ అయి ఉన్నా కూడా ఈ ఫీచర్ మీరు వినియోగించుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయడి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?